15ఏళ్లుగా ధరించిన డైమండ్ చెవి రింగ్ పోగొట్టుకుందిట
15 సంవత్సరాలుగా ధరించిన తన చెవి రింగును పోగొట్టుకున్నానని.. దానిని కనుగొనడంలో సహాయపడాలని ప్రముఖ వెటరన్ నటి జూహి చావ్లా ట్విట్టర్ లో అభిమానుల్ని కోరడం ఆసక్తిగా మారింది. ``గత 15 సంవత్సరాలుగా నేను ఈ చెవిరింగులను దాదాపు ప్రతిరోజు ధరించాను.. ఇప్పుడు పోగొట్టుకున్నాను`` అంటూ ఆవేదనగా జుహి చావ్లా వెల్లడించారు. తన రింగును వెతికి ఇవ్వాల్సిందిగానూ అభ్యర్థించారు.
ముంబై విమానాశ్రయంలో తాను కోల్పోయిన చెవి రింగుని కనుగొనడంలో సహాయపడాలని ఆదివారం సాయంత్రం పోస్ట్ చేయడంతో దానికి ట్విట్టర్ లో అభిమానులు రిప్లయ్ లు ఇచ్చారు.
ఈ ఉదయం నేను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టి 2 డ్రైవ్ వేలో ప్రనామ్ బగ్గీలో గేట్ 8 వైపు నడుస్తున్నప్పుడు.. ఎమిరేట్స్ కౌంటర్.. సెక్యూరిటీ చెక్ ఇమ్మిగ్రేషన్ వద్ద తనిఖీ చేశారు. ఎక్కడో నా వజ్రాల చెవి జారి పడిపోయింది. ఎవరైనా దాన్ని కనుగొనడంలో నాకు సహాయపడండి ప్లీజ్. అది దొరికితే దయచేసి పోలీసులకు నివేదించండి. మీకు బహుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను! అని జుహీ అభ్యర్థించారు.
కెరీర్ విషయానికి వస్తే.. జూహి చావ్లా చివరిసారిగా 2019 రొమాంటిక్ డ్రామా `ఏక్ లడ్కి కో దేఖా తోహ్ ఐసా లగా` లో కనిపించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్ - రాజ్ కుమార్ రావులతో పాటు సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇష్క్.. రాజు బాన్ గయా జెంటిల్మాన్ వంటి చిత్రాలతో జూహీ కి మంచి పేరొచ్చింది. 1986 చిత్రం `సుల్తానాథ్`తో నటిగా కెరీర్ మొదలు పెట్టారు. జూహీ చావ్లా తెలుగులో నాగార్జున సరసన `విక్కీ దాదా`లో నటించిన సంగతి తెలిసిందే.