ఇండియన్ సినిమాల్లో గ్యారేజ్‌ కే తొలిసారట

Update: 2016-08-27 11:30 GMT
డాల్బీ అట్మాస్.. కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాలో చర్చనీయాంశమవుతున్న సౌండ్ టెక్నాలజీ. థియేటర్లో సౌండ్ విషయంలో ఇదో రెవల్యూషన్. థియేటర్లో అన్ని వైపుల నుంచి మరింత స్పష్టతతో శబ్దాల్ని ఆస్వాదించే వీలు కల్పించే టెక్నాలజీ ఇది. పెద్ద సినిమాలన్నింటికీ ప్రస్తుతం తప్పనిసరిగా ఆ సౌండ్ టెక్నాలజీని యాడ్ చేస్తున్నారు. ఐతే ఈ టెక్నాలజీతో ఇండియన్ సినిమాల్ని ఆస్వాదించే అవకాశం విదేశీ ప్రేక్షకులకు ఉండట్లేదు. ఆ టెక్నాలజీ యాడ్ చేసేటప్పటికి ఆలస్యమవుతోంది. అప్పటికి సినిమాలు వెళ్లిపోతున్నాయి.  అమెరికాలో రిలీజైన ఏ ఇండియన్ సినిమానూ ఇప్పటిదాకా నేరుగా రిలీజ్ టైంలోనే డాల్బీ అట్మాస్ లో అందించలేదట. ఈ విషయంలో ‘జనతా గ్యారేజ్’దే రికార్డు అంటున్నారు.

అమెరికాలో నేరుగా డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీతో రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదేనట. ‘జనతా గ్యారేజ్’ను అమెరికాలో రిలీజ్ చేస్తున్న ‘ఫికస్’ ఈ విషయాన్ని వెల్లడించింది. ముందుగా కొన్ని లొకేషన్లలో డాల్బీ అట్మాస్ తో రిలీజ్ చేసి.. ఆ తర్వాత మరిన్ని లొకేషన్లకు ఈ టెక్నాలజీని యాడ్ చేయబోతున్నారు. అమెరికాలో ‘జనతా గ్యారేజ్’ స్క్రీన్ కౌంట్ ఇంకా తేలలేదు. కనీసం 200 స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. అమెరికా కాకుండా మిగతా దేశాల్లో ‘ఆస్ తెలుగు’ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. అమెరికా కాకుండానే 187 స్క్రీన్లలో స్క్రీన్లలో సినిమా విడుదలవుతోంది. ఇండియాలో మినహాయించి 400 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజవుతుందని అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News