`అవతార్ 2` 100 శాతం పూర్తి.. అవతార్ 3 ఫినిషింగ్ లో!-కామెరూన్‌

Update: 2020-09-29 04:45 GMT
అవతార్ 2 చిత్రీకరణ పూర్తయిందని.. అలాగే అవ‌తార్ 3 చిత్రీక‌ర‌ణ 95 శాతం పూర్త‌య్యింద‌ని లెజెండ‌రీ ద‌ర్శ‌క‌నిర్మాత‌ జేమ్స్ కామెరాన్ చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఆర్నాల్డ్ స్క్వార్జె నెగర్ ‌తో మాట్లాడుతున్నప్పుడు ఈ సంగ‌తిని చెప్పారు కామెరూన్. అవతార్ 2 కోసం ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ పూర్తయింద‌ని.. బ్యాక్-టు-బ్యాక్ చిత్రీకర‌ణ‌లో భాగంగా మూడవ భాగం కూడా 95 శాతం పూర్తయిందని కామెరాన్ తెలిపారు.

“కోవిడ్ ప్రతి ఒక్కరినీ కొట్టినట్లు మమ్మల్ని కొట్టింది. మేం నాలుగున్నర నెలల పాటు సినిమా తీయ‌లేక‌పోయాం. దాని ఫలితంగా మేము 2022 డిసెంబరు వ‌ర‌కూ విడుదల కోసం వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఉంది. మరో పూర్తి సంవత్సరానికి ఆల‌స్య‌మే ఇది. ఇప్పుడు సినిమా పూర్తి చేయడానికి నాకు అదనపు సంవత్సరం ఉందని దీని అర్థం కాదు. ఎందుకంటే మేం అవతార్ 2 ను పంపిణీ చేసిన రోజు అవతార్ 3 ని పూర్తి చేసే పనిలో ఉంటాం`` అని కామెరూన్ అన్నారు.

అసలు చిత్రం మాదిరిగానే న్యూజిలాండ్‌లో అవతార్ సీక్వెల్స్‌ను చిత్రీకరించాలని నిర్ణయించుకోవడం తనకు.. త‌న‌ సిబ్బందికి అదృష్టమని కామెరాన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించ‌డంలో న్యూజిలాండ్ ప్రతిస్పందన ఆదర్శంగా ఉంది. ఇది సురక్షితమైన వాతావరణంలో చిత్రీకరణకు సాయ‌ప‌డింది అని కామెరూన్ తెలిపారు.

అవ‌తార్ చిత్రంలో సామ్ వర్తింగ్‌టన్ - జో సల్దానా- స్టీఫెన్ లాంగ్ - మిచెల్ రోడ్రిగెజ్ - సిగౌర్నీ వీవర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ పాత్ర‌ల‌న్నీ సీక్వెల్స్‌లో తిరిగి వస్తాయి. కేట్ విన్ స్లెట్- క్లిఫ్ కర్టిస్- ఈడీ ఫాల్కో- బ్రెండన్ కోవెల్- మిచెల్ యోహ్- జెమైన్ క్లెమెంట్- ఓనా చాప్లిన్- డేవిడ్ థెవ్లిస్- సిజె జోన్స్ - విన్ డీజిల్ సీక్వెల్స్ తో ఫ్రాంచైజ్ తారాగణంగా చేరారు.
Tags:    

Similar News