అన్ని సినిమాలు లైన్లో పెట్టేశాడా!!

Update: 2016-06-15 05:18 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి కంటే బిజీగా ఉన్న యాక్టర్ ఎవరంటే.. జగపతి బాబు అనే చెప్పాలి. హీరోలు - కేరక్టర్ ఆర్టిస్టులు - టెక్నీషియన్లు.. ఇలా ఏ కేటగిరీ చూసుకున్నా ఒకేసారి 17 సినిమాలు లైన్ లో పెట్టిన ఆర్టిస్ట్ మరొకరు ఉండే ఛాన్స్ లేదు. తను హీరోగా పీక్ స్టేజ్ లో ఉన్నపుడు కూడా జగపతి బాబు చేతిలో ఎనాడూ 17 సినిమాలు ఉండి ఉండవు. అంటే ఇప్పుడు జగ్గూభాయ్ తన కెరీర్ లో బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడని అనాల్సిందే.

లెజెండ్ మూవీలో క్రూక్డ్ విలన్ - శ్రీమంతుడిలో సాఫ్ట్ ఫాదర్ - నాన్నకు ప్రేమతో చిత్రంలో పోష్ విలన్ పాత్రల తర్వాత.. జేబీ రేంజ్ ఫుల్లుగా మారిపోయింది. తెలుగులోనే కాదు.. మొత్తం సౌతిండియాలోని అన్ని భాషల్లో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. గోపీచంద్ ఆక్సిజన్ - పూరీ-కళ్యాణ్ రామ్ చిత్రాలు ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రొడక్షన్ స్థాయిలో ఉన్నాయి. ఇక సాయిధరం తేజ్-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న మూవీకి కూడా జగపతి సైన్ చేశాడు. నాగార్జున-రాఘవేంద్రరావు తీస్తున్న ఓ నమో వెంకటేశాయ. బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిల్లో కూడా జగపతి కీలకపాత్రలు చేస్తున్నాడు. చిరు 150 కత్తిలాంటోడులో కూడా జగపతిబాబుకి ప్రధాన పాత్ర ఆఫర్ చేసే ఛాన్సులున్నాయి.

మలయాళంలో మోహన్ లాల్ మూవీతో పాటు విజయ్ - విశాల్ ల చిత్రాల్లోనూ జేబీ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇప్పుడైతే ఓ కన్నడ సినిమా సెట్స్ పై ఉన్నాడు. ఇవి కాక సైన్ చేసిన ప్రాజెక్టుల లెక్క అంతా కలిపితే.. జగపతి మొత్తం 17 సినిమాలు లైన్ లో పెట్టేశాడు.
Tags:    

Similar News