జబర్దస్త్ కమెడియన్స్ అంతా జెంటిల్ మెన్స్ : అనసూయ
జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు ఆకతాయిలు అడిగే ప్రశ్నలకు శివాలెత్తి వారికి గట్టి రిప్లై ఇచ్చేఇస్తుంది. గతంలో పలు సార్లు తనను కామెంట్స్ చేసిన వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ తాజాగా మరోసారి ఒక నెటిజన్ కు క్లాస్ పీకింది. జబర్దస్త్ గుర్తించి కొందరు చేస్తున్న విమర్శలకు ఆమె ఘాటైన సమాధానం చెప్పింది.
జబర్దస్త్ లో ట్రోల్స్ కాకుండా ఇంకా ఏమైనా చేస్తారా మేడం అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించడంతో అనసూయకు తిక్క రేగింది. అతడికి అతడి స్టైల్ లోనే సమాధానం చెప్పింది. ఈ విషయంలో నీకు ఈ రోజు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. జబర్దస్త్ లో ఎలాంటి కామెంట్స్ చేసిన ట్రోల్స్ చేసినా కూడా అది కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసం మాత్రమే. పర్సనాల్టీమీద పంచ్ లు వేసిన కర్ డ్రస్ ఇలా దేని గురించి కామెంట్స్ చేసినా కూడా అది మిమ్ములను నవ్వించడం కోసం మాత్రమే.
జబర్దస్త్ షో ప్రసారంకు ముందు ఆ విషయాన్ని తెలియజేస్తాం. ఇందులో చూపించిన ఏ ఒక్క సన్నివేశం కాని డైలాగ్ కాని ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇందులోని ప్రతి అంశం కూడా వినోదం కోసమే అంటూ క్లీయర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక వేళ కమెడియన్స్ ఎవరైనా నామీద పంచ్ లు వేయాలి అనుకున్నా కూడా ముందే నా అనుమతి తీసుకుంటారు. వారు నేను ఒప్పుకుంటేనే నన్ను స్కిట్ లో ఇన్వాల్వ్ చేస్తారు.
ఏదో ఒక సందర్బంలో మాత్రమే అనుకోకుండా పంచ్ లు పడుతాయి. అంతే తప్ప అందులో ఉన్నది అంతా ముందుగా రాసుకున్న ప్రకారం వినోదం కోసం సాగుతాయని అంది. జబర్దస్త్ లోని కమెడియన్స్ ప్రతి ఒక్కరు కూడా జెంటిల్ మెన్స్. వారు ఇతరుల పట్ల ఎప్పుడు తప్పుగా ప్రవర్తించరు. ఇతరులను అవమానించే విధంగా పంచ్ లు వేయరు అంటూ అనసూయ అతడికి సమాధానం ఇచ్చింది.