బాహుబలి ఫస్ట్‌ షో టాక్‌: మనోహరీ..

Update: 2015-07-10 04:04 GMT
ఈగ, మర్యాద రామన్న సినిమాల్లో కుదరక పెట్టలేదో లేకపోతే ఫ్లో డిస్టర్బ్‌ అవుతుందని తియ్యలేదో కాని.. ఆ రెండింటిలో అసలు ఐటెం నెంబర్లే లేవు. కాకపోతే తన ప్రతీ సినిమాలోనూ బీభత్సమైన ఐటెం నంబర్స్‌ పెట్టించుకోవడంలో రాజమౌళి దిట్ట. ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, యమదొంగ సినిమాల్లో ఈ ఐటెం పాటలకు బలే క్రేజ్‌ వచ్చింది. ఇక బాహుబలి విషయానికి వస్తే... ఈ సినిమాలో కూడా ఏరికోరి ఒక ఐటెం సాంగ్‌ పెట్టించేశాడు రాజమౌళి.

మనోహరి అంటూ సాగే ఓ పాటలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు భామలతో అదిరిపోయే రసభరితమైన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. ఫిల్మింగ్‌ వైజ్‌ చూసుకుంటే కాస్త ''యమదొంగ'' సినిమాలోని కింగు యమా యంగు యమా సాంగులో ముగ్గురు భామలు చేసిన రొమాన్స్‌ను తలపించినా కూడా.. ఇందులో చేసిన ఫారిన్‌ భామలు బాగా కైపెత్తించారు. 'టెంపర్‌' గాళ్‌ నోరా ఫతేహి, 'ఎవడు'లో ఐటెం చేసిన స్కార్లెట్‌ విల్సన్‌, అలాగే మరొక మోడల్‌ మధు స్నేహ ఆ పాటలో తన ఒంపుసొంపుల వయ్యారాలతో ప్రభాస్‌ను కవ్విస్తుంటే.. వారెవ్వా ఫుల్‌ జోష్‌ వచ్చేసిందమ్మా ధియేటర్‌లో.. కాకపోతే రాజుల కాలం నాటి సినిమా కాబట్టి అమ్మాయిలతో లయబద్దమైన స్టెప్పులు వేయించి వారి నాజూకైన అందాలను దోచుకున్నారు కాని, ప్రభాస్‌తో మాత్రం భారీ స్టెప్పులేవీ వేయించలేదు.
Tags:    

Similar News