డిజిట‌ల్ సిరీస్ చేయ‌డానికి 250కోట్లు ఆఫ‌ర్ చేస్తే నో చెప్పాడు

Update: 2020-11-24 12:10 GMT
కొద్దిరోజులుగా ప్ర‌భుదేవా రెండో పెళ్లి వ్య‌వ‌హారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సైలెంటుగా త‌న ఫిజియో థెర‌పిస్టును ప్రేమించి పెళ్లాడేశాడు. ఇంత‌కుముందు తొలి భార్య రామ‌ల‌త‌కు అత‌డు విడాకులిచ్చి విడిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ టాపిక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా న‌లుగుతుండ‌గానే ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `రాధే` డిజిట‌ల్ రిలీజ్‌ పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఈ మూవీని క్రైసిస్ వ‌ల్ల ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారంటూ గుట్టు చ‌ప్పుడు కాకుండా నెటిజ‌నుల్లో ప్ర‌చార‌మైపోతుంటే చిత్ర‌బృందం ఖంగు తింది. ముఖ్యంగా ప్ర‌భుదేవా వెంట‌నే దీనిపై స్పందిస్తూ అస‌లు ఓటీటీ మార్గంలో రాధే వెళ్ల‌ద‌ని ప్ర‌క‌టించేశారు.

సల్మాన్ ఖాన్ నటించిన `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` కేవ‌లం థియేట్రిక‌ల్ రిలీజ్ కి మాత్ర‌మే రెడీ అవుతుంద‌ని భాయ్ సినిమాలేవీ అలా వేరొక మార్గంలో రిలీజ్ కావ‌ని ప్ర‌క‌టించారు ప్ర‌భుదేవా.

నిజానికి డిజిట‌ల్లో రిలీజ్ చేయాలంటే ఈ మూవీకి పెట్టిన పెట్టుబ‌డి చిన్న‌ది అయ్యి ఉండాలి. కానీ భాయ్ కి డిజిటల్ కంటెంట్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తాలు ఇవ్వాల్సి ఉంటుంది. గ‌ట్టి ఆఫ‌ర్ అయితేనే చేస్తారు అంటూ రాధేపై అన‌వ‌స‌ర ప్ర‌చారాన్ని ఖండించారు. సల్మాన్ ‌కు  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‌లలో ఒక దిగ్గ‌జం సిరీస్ చేస్తానంటే రూ. 250 కోట్లు చెల్లిస్తాన‌ని ఆఫ‌ర్ చేసింద‌ట‌. కానీ ఈ ఆఫ‌ర్ ఇచ్చినా భాయ్ తృణ‌ప్రాయంగా తిర‌స్క‌రించార‌ని కూడా తెలుస్తోంది. అలాగే స‌ల్మాన్-ప్రభుదేవా `వాంటెడ్` కి అనధికారిక సీక్వెల్ `రాధే- యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` అన్న ప్ర‌చారం సాగుతోంది.
Tags:    

Similar News