'పుష్ప' లో కూడా వెన్నుపోటు ఎలిమెంట్ ఉండబోతోందా..?
డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పుష్ప నుంచి విడుదలైన టీజర్ - ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టున్నాయి. ఈ యాక్షన్ డ్రామాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్ కూడా అలరిస్తోంది. అయితే తాజా 'పుష్ప' సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
'పుష్ప' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకముందు 'బాహుబలి' చిత్రాన్ని ఈ విధంగా రెండు సినిమాలుగా చేశారు. 'బాహుబలి 1' క్లైమాక్స్ లో బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపారనే క్యూరియాసిటీని జనాల్లో కలిగించి.. 'బాహుబలి 2' బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశారు. ఇప్పుడు పుష్ప విషయంలో కూడా అలాంటి ఆసక్తికరమైన సస్పెన్స్ ఎలిమెంట్ ఉండబోతుందట.
ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో రాబోయే క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ స్మగ్లర్ గా ఎలా మారాడు.. ఎర్రచందనం సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకొని ఒక డాన్ గా ఎలా ఎదిగారనేది చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే పుష్పరాజ్ అతి పెద్ద శక్తిగా ఎదగడానికి విలన్ గ్యాంగ్ లో ఒకరు కీలక పాత్ర పోషిస్తారట. విలన్ తో ఉంటూనే హీరోకి సహాయం చేసే ఆ పాత్ర గురించి క్లైమాక్స్ లోప్రస్తావించి.. సెకండ్ పార్ట్ లో అతనెవరనేది రివీల్ చేస్తారట.
అంతేకాదు డాన్ గా పుష్పరాజ్ ఎదిగిన తర్వాతి కథ అంతా 'పుష్ప 2' లో చూపించనున్నారు. మొదటి నుంచీ 'బాహుబలి' ని ఫాలో అవుతున్న పుష్ప.. ట్విస్ట్ లో కూడా దాన్నే అనుసరిస్తోందని అంటున్నారు. అక్కడ బాహుబలి ని కట్టప్ప వెన్నుపోటు పొడిస్తే.. ఇక్కడ విలన్ ని ఒక పాత్ర వెన్నుపోటు పొడిచేలా ప్లాన్ చేసారట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే.