అదే ఆ డైరెక్ట‌ర్ కి శాపంగా మారిందా!

Update: 2020-04-10 04:31 GMT
స‌క్సెస్ లేక‌పోతే స‌న్నివేశం వేరు. సక్సెస్ ఉండీ అవ‌కాశం రాక‌పోతే ఆ స‌న్నివేశం వేరు. ఈ సీన్ లో ఎవ‌రికైనా మాన‌సిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లిగేదే.  ప్ర‌స్తుతం అగ్ర హీరోల‌తో మాత్ర‌మే సినిమాలు చేస్తాన‌ని ప‌ట్టు బ‌ట్టే ఆ డైరెక్ట‌ర్ ప‌రిస్థితి ఇలానే ఉంది. ఎన్టీఆర్.. చ‌ర‌ణ్‌.. నాగార్జున‌.. మ‌హేష్ లాంటి స్టార్ల‌తో వ‌రుస‌గా సినిమాలు చేసిన స‌ద‌రు డైరెక్ట‌ర్ ఊహించ‌ని విధంగా వీళ్లంద‌రికీ స‌క్సెస్ ని ఇచ్చి తాను మాత్రం కెరీర్ లో వెన‌క‌బ‌డిపోయాడు. చివ‌రిగా అత‌డివ‌ల్ల‌ హిట్టు అందుకుని మ‌రీ హ్యాండిచ్చాడు ఓ స్టార్ హీరో. దీంతో ఈ స‌న్నివేశం ఊహించ‌నిది కావ‌డంతో ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయాడు.

ఇప్పుడు ఏ ఇత‌ర స్టార్ హీరోని క‌లిసినా వెంట‌నే ఓకే చెప్ప‌ని ప‌రిస్థితి ఉంది.  కెరీర్ లో ఆహా ఓహో అనిపించే సినిమాలేవీ చేయ‌క‌పోయినా మినిమం గ్యారెంటీ హిట్లు ఇచ్చాడ‌న్న టాక్ అయితే ఉంది. క‌నీసం అది చూసి అయినా స‌ద‌రు స్టార్ హీరోలు త‌న‌ని ద‌రి చేర‌నివ్వొచ్చు క‌దా! క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో అయినా కాస్త త‌ను చెప్పే క‌థ వినేందుకు కొంత స‌మ‌యం కేటాయించ‌వ‌చ్చు క‌దా! అంటే ప్ర‌స్తుతం సీన్ అలా క‌నిపించ‌డం లేదట‌. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను స్టార్ హీరోలు మ‌రో రెండేళ్ల పాటు స‌రిప‌డే క‌మిట్ మెంట్ల‌తో బిజీబిజీగా ఉండ‌డంతో ఎవ‌రూ ఛాన్స్ ఇవ్వ‌డం లేద‌ట‌. దీంతో ఈ అనూహ్య స‌న్నివేశానికి స‌ద‌రు డైరెక్ట‌ర్ క‌ల‌త‌గా ఉన్నార‌ని చెబుతున్నారు.

అయితే పెద్ద హీరోలు ఎవ‌రూ త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోయినా .. క‌నీసం న‌వ‌త‌రం స్టార్ల‌తో ఓ సినిమా చేసి దానిని ట్రెండ్ సెట్టింగ్ హిట్ చేయాల‌న్న త‌ప‌న అయితే త‌న‌కు లేనే లేదు. కేవ‌లం స్టార్ హీరోల‌తో మాత్ర‌మే సినిమాలు చేయాల‌న్న పంతం అలానే ఉండిపోయింద‌ట‌. ఇప్పుడున్న హీరోల్లో ఒక్క చ‌ర‌ణ్ త‌ప్ప వేరే ఏ హీరో అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో ఇటీవ‌ల స‌న్నివేశం చాలా డిఫ‌రెంటుగా ఉంది. ప్ర‌తి హీరో స్టోరీ బ్యాంక్ రెడీ చేసుకుంటున్నారు. కొత్త కుర్రాళ్ల‌కు ఇన్నోవేటివ్ క‌థ‌ల‌కు ఓకే చెబుతున్నారు.ఈ  ప‌రిణామ‌మే స‌ద‌రు సీనియ‌ర్ ద‌ర్శ‌కుడికి శాపంగా మారిందా? అన్న చ‌ర్చా సాగుతోంది.


Tags:    

Similar News