సొంత ఓటిటి ఆలోచనలో ప్రముఖ నిర్మాత!!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు త్వరలోనే ఓ కొత్త బాటలో అడుగు పెట్టబోతున్నారట. ఆయన తండ్రి మూవీ మొఘల్ రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ సామ్రాజ్యాన్ని ప్రస్తుతం సురేష్ బాబు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతంగా రన్ అవుతున్న ప్రొడక్షన్ హౌస్ ఇది. అలాగే సురేష్ బాబు విజయవంతమైన నిర్మాతలలో ఒకరు. అయితే సురేష్ బాబు ఎప్పుడు కూడా తొందర పడడు. ఒకటికి వందసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మంచి టాక్ ఉంది. సినిమాల కోసం.. హీరోల కోసం.. ఇతర టెక్నీషియన్ల కోసం ఆయన ఎప్పుడు కూడా పోటీ పడినట్లు కనిపించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. సురేష్ బాబు ఆయన కొడుకు రానా కలిసి వెబ్ సిరీస్‌లను రూపొందించే ప్రణాళికలో ఉన్నారట. అందుకోసం ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశాడట.
అయితే అది ఏ విధంగా అంటే.. ఓ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ ప్రారంభించే ఆలోచన చేస్తున్నారట. దీని పై సురేష్ బాబు ఇటీవలే ఒక ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. "తను సొంతంగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడానికి తన వద్ద తగిన సోర్సెస్ అండ్ ఒక స్ట్రాంగ్ టీమ్ ఉందని.. అయితే ప్రస్తుతం ఆయన ఓటిటి మార్కెట్‌ను గమనిస్తున్నట్లు చెప్పారు. ఇక త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ సిద్ధం చేస్తానని అన్నారు. కానీ తేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. సురేష్ బాబు తన సొంత ఓటిటి ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెడతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడే ఛాన్స్ అని.. రానా తన ముంబై పరిచయస్తులతో కలిసి వివిధ కార్పొరేట్ దిగ్గజాలతో సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లను రూపొందించాలని చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే రానా నటించనున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ రానా రాబోయే చిత్రం 'హిరణ్యకశ్యప'తో సౌత్ లో అడుగుపెడుతోంది. అయితే సురేష్ బాబు ప్రారంభించే డిజిటల్ ప్లాట్‌ఫాం గురించి త్వరలో ప్రకటన రానుందట.