• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సినిమాలో మెగాస్టార్...

ఆ సినిమాలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారా..?

By - Tupaki Desk
Update: 2020-06-29 09:10 GMT
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య. ఈ సినిమా పై మెగా అభిమానులలో ఓ రేంజిలో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయిందట. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నాడట డైరెక్టర్. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర ఎండోమెంట్స్ అధికారిగా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందట. అంతేగాక చిరు డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నట్లు సమాచారం. గతంలో కనిపించే ఒక చిన్న పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. ఇక చిరు హీరో ఎలివేషన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ట్విస్టులు, పోరాట ఘట్టాలు.. ఇలా అన్నీ అంశాలు మేళవించానని ఇదివరకే చెప్పాడు కొరటాల. చిరు కోసం బాగా ఎమోషన్స్ తో కూడిన బలమైన డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయట. అయితే ఈ సినిమాలో రాంచరణ్ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ స్ఫూర్తి పొందేది చరణ్ పాత్రనుండేనట. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిహారిక కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరు తన తదుపరి సినిమా లూసిఫర్ కోసం కూడా సిద్ధం అవుతున్నాడట. ఇక హీరోయిన్ కాజల్ త్వరలోనే ఆచార్య షూటింగులో పాల్గొననుంది. మరో విశేషం ఏంటంటే రాంచరణ్ సరసన కూడా ఓ హీరోయిన్ కనిపించనుందట. ఆమె ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందేనట!
Tags:    
  • Acharya 
  • Acharya Movie 
  • Chiranjeevi 
  • Koratala Siva 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Ram Charan 

Similar News

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS