డిజిట‌ల్ ప్ర‌చారంతో మ‌హాన‌టి బాగానే ఆర్జిస్తోందా?

Update: 2020-12-19 05:45 GMT
సోష‌ల్ మీడియా డిజిట‌ల్ విప్ల‌వం ప‌ర్య‌వ‌సానం క‌థానాయిక‌ల సంపాద‌న‌కు మ‌రింత‌గా అవ‌కాశం క‌ల్పిస్తోంది. సెల‌బ్రిటీల‌తో ప్ర‌చారం చేయించుకునేందుకు కార్పొరెట్ కంపెనీలు ఎంత‌గా త‌పిస్తున్నాయో చూస్తున్న‌దే. ఇప్పుడు మ‌హాన‌టి కీర్తి సురేష్ కి అలాంటి అవకాశం చేజిక్కింది మ‌రి.

హ‌లో దుబాయ్..! అంటూ కీర్తి చేస్తున్న హంగామా మామూలుగా లేదు. హ‌లోదుబాయ్ అంటూ ఆ దేశ ప‌ర్యాట‌కానికి ప్ర‌మోష‌న్ చేస్తుంద‌ని అనుకుంటే పొర‌పాటే ఆ పేరుతో ఉన్న డిజైన‌ర్ స్టోర్ కి ప్ర‌చారం చేస్తోంది. దీనికోసం కీర్తి భారీ ప్యాకేజీనే అందుకుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

కీర్తి సురేష్ తో పాటు ప‌లువురు త‌మిళ సెల‌బ్రిటీలు ఈ ఆన్ లైన్ స్టోర్ కి బాగానే ప్ర‌చారం చేస్తున్నారు. కీర్తి వైట్ టాప్ డెనిమ్స్ లో అద‌ర‌గొడుతోంది. ప్ర‌చారం బావుంది.. సంపాద‌న‌కు సంపాద‌న బావుంది అంటూ అభిమానులు అదిరిపోయే కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Tags:    

Similar News