కాజల్ జాలీ ట్రిప్ బాయ్ ఫ్రెండ్ తోనా??
ఫిలిం ఇండస్ట్రీ లో హీరోయిన్ల పరిస్థితి ఒక విషయం లో మాత్రం సంక్లిష్టంగా ఉంటుంది. అదేంటంటే మ్యారేజ్. కెరీర్ పై ఫోకస్ చేస్తూ ఎంత స్టార్ హీరోయిన్ గా ఎదిగినా.. కోట్లకు కోట్లు సంపాదించినా 15- 20 ఇయర్స్ ఇండస్ట్రీ అనిపించుకున్నా పెళ్ళి లేకపోతే ఒక దశలో జీవితం శూన్యంగా ఉంటుంది. అప్పటికే వయసు దాటిపోయి ఉంటుంది. దీంతో వివాహమే వద్దనుకుంటారు. అలా అని త్వరగా వివాహం చేసుకుంటే కెరీర్ దెబ్బ తింటుందేమోనని భయం. ఈ కన్ఫ్యూజన్ లోనే చాలామంది హీరోయిన్లు ఒంటరిగా మిగిలిపోయారు. అయితే ఈ జెనరేషన్ హీరోయిన్లు మాత్రం అలా లేరు. వీరిలో ఎక్కువమంది తమ కెరీర్ చివరిదశకు చేరుతుందని సూచనలు అందగానే ఒక అందమైన వ్యక్తి ప్రేమలో పడిపోతున్నారు. ప్రస్తుతం కాజల్ కూడా అదే పనిలో ఉందని సమాచారం.
కాజల్ ప్రస్తుతం మాల్దీవ్స్ కు ఓ జాలీ ట్రిప్ వేసుకుంది. అక్కడి నుంచి బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తోంది. ఒకవేళ వెకేషన్ కు ఫ్రెండ్స్ తో పోతే వారెవరైనా కనిపించాలి కదా.. ఎవ్వరూ లేరు. పోనీ కుటుంబ సభ్యులతో పోయిందా అంటే అది కూడా కాదు. ఈ ట్రిప్ ను కాజల్ తన బాయ్ ఫ్రెండ్ తో ప్లాన్ చేసుకుందట.. రొమాంటిక్ వెకేషన్ అన్నట్టు. కాజల్ ఓ ముంబై బేస్డ్ వ్యాపార వేత్తతో ప్రేమ లో పడిందని.. చెట్టా పట్టాలేసుకుని తిరుగుతోందని చాలా రోజుల నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ విషయం మాత్రం కాజల్ సీక్రెట్ గా నే దాచిపెడుతోందట. ఈసారి మాత్రం కాజల్ తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. తన బాయ్ ఫ్రెండ్ బుజాలపై ఎక్కిన ఫోటో ఒకటి నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.
ఈ లెక్కన త్వరలో కాజల్ కు డుండుంపీపీ ఘడియలు వచ్చినట్టే. కాజల్ చేతిలో ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి కానీ ఇంతకు మునుపు ఉన్నంత డిమాండ్ లేదు. దీంతో జీవితంలో సెటిల్ కావాలని కాజల్ కోరుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయినా డోనాల్డ్ ట్రంప్.. కిమ్ ఉన్ జోంగ్ లాంటివారే పెళ్లి చేసుకున్నారు.. కాజల్ చేసుకుంటే తప్పేముంది?