# PRABHAS 21 డైరెక్ట‌ర్ ఛేంజ్‌.. ఏంటీ స‌డెన్ ట్విస్ట్‌?

Update: 2020-08-28 03:30 GMT
కొన్ని ప్ర‌క‌టన‌లు అన‌వ‌స‌ర టెన్ష‌న్ ని పెంచుతాయి. అనుకున్న‌దొక్క‌టి అయిన‌దొక్క‌టి అన్న చందంగా చివ‌రికి విష‌యంలో క్లారిటీ లేకుండా పోతుంది. తాజాగా బాలీవుడ్ మీడియా ముందు ఓంరౌత్ దూకుడు చూస్తుంటే ప్ర‌భాస్ 21 ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంత‌కీ తానాజీ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ముంబై మీడియా ముందు ఏమ‌ని ప్ర‌క‌టించాడు? అంటే.. ప్ర‌భాస్ తో త‌న సినిమా `ఆదిపురుష్ 3డి` జ‌న‌వ‌రి 2021 నుంచి మొద‌ల‌వుతుంద‌ని అనౌన్స్ చేసేశాడు. దీంతో ఇటువైపు నాగ్ అశ్విన్ - అశ్వ‌నిద‌త్ టీమ్ లో ఒక‌టే టెన్ష‌న్ షురూ అయ్యిందిట‌. మాకంటే దూకుడుగా ఉన్నాడు! అంటూ ఒక‌టే అలెర్ట‌య్యార‌ని గుస‌గుస‌లు మొద‌లైపోయాయి.

నిజానికి ప్ర‌భాస్ 21 నాగ్ అశ్విన్ తో ఉంటుంద‌ని.. ప్ర‌భాస్ 22 (ఆదిపురుష్‌) కి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని భావించారంతా. నాగ్ అశ్విన్ తో ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌భాస్ 21 చిత్రాన్ని లాంచ్ చేసేశారు కూడా. కానీ అత‌డి కంటే ఆల‌స్యంగా సీన్ లోకి వ‌చ్చిన‌ ఓం రౌత్ ప్ర‌క‌ట‌న‌లు స్పీడ్ గా క‌నిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ ఇంకా ప్ర‌భాస్ తో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ గురించి చెప్ప‌నే లేదు. ఈలోగానే ఓం రౌత్ మాత్రం త‌న సినిమా జ‌న‌వ‌రి నుంచి మొద‌లైపోతోంద‌ని ప్ర‌క‌టించేడ‌యం ర‌క‌ర‌కాల సందేహాల‌కు తావిస్తోంది.

ఇక ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్ ఇప్ప‌టికే విలువిద్య ప్రాక్టీస్ చేస్తున్నాడ‌ని.. బాడీ లాంగ్వేజ్ మార్చుకునేందుకు జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ని ప్ర‌చారం సాగుతుండ‌డంతో నాగ్ అశ్విన్ టీమ్ లో టెన్ష‌న్ మొద‌లైందట‌. అయితే అన్ని టెన్ష‌న్ ల‌కు చెక్ పెట్టాలంటే ప్ర‌భాస్ స్వ‌యంగా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ‌రితో ముందు .. ఎవ‌రితో త‌ర్వాత‌! అన్న‌ది తేల్చాల్సి ఉంటుంది. ఓం రౌత్ ప్ర‌క‌ట‌న చూస్తుంటే ఎవ‌రి స్క్రిప్టు రెడీగా ఉందో.. ఎవ‌రు ప్రీప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసి రెడీగా ఉంటారో వారితోనే ప్ర‌భాస్ ముందుగా సెట్స్ కెళ‌తారు! అన్న‌ట్టుగానే ఉంద‌ని సందేహం.
Tags:    

Similar News