ఫోటో స్టోరి : ఈత కొల‌నులో స్టార్ కిడ్ ఫికర్

Update: 2020-12-08 04:36 GMT
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ బిగ్ గోల్స్ గురించి ఫ్యాన్స్ కి తెలిసిన‌దే. నిరంత‌రం త‌న‌ని సోష‌ల్ మీడియాల్లో అనుస‌రించే అభిమానుల‌కు ఇరా మాన‌సిక స్థితి గురించి చెప్పాల్సిన అస‌వ‌రం లేదు. తాను చిన్న‌ప్పుడు లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నాన‌ని ప్ర‌క‌టించి షాకిచ్చారు ఇరాఖాన్. ద‌ర్శ‌కురాలిగా ఎద‌గాల‌న్న ప‌ట్టుద‌ల‌ను ప్ర‌తిసారీ క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్ప‌టికే స్టేజీ ప్లేకి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించి పాపా అమీర్ చేత విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు పొందారు.

ఇరా త‌న బిజీ లైఫ్ కి చిన్న‌పాటి బ్రేక్ నిచ్చి వ్య‌క్తిగ‌త జీవితానికి ప్రాధాన్య‌త‌నిచ్చార‌ట‌. తాజాగా  స‌్విమ్మింగ్ పూల్ లో జ‌ల‌కాలాడుతున్న ఫోటోల్ని షేర్ చేశారు. టూ పీస్ బికినీలో ఇరా నెటిజనుల‌ను ఆక‌ట్టుకున్నారు.  ముంబై లోనావాలాలోని స‌్విమ్మింగ్ పూల్ లో ఇరా ఖాన్ ఫొటోల‌కు ఫోజిచ్చారు. ఆ ఫొటోల‌ని ఇన్ ‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ఇవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

ఇటీవలే యూరిపిడెస్ మెడియా అనే నాటకంతో దర్శకురాలిగా ఇరా ఖాన్ త‌న జ‌ర్నీ మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ  స్టార్ కిడ్ తిరిగి త‌న పని ప్రారంభించేందుకు లోనా వాలాలో రెస్ట్ తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని ఇన్ స్టాలో పంచుకున్న ఇరా ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

`నాకు చాలా చేయాల‌ని ఉంది. సోషల్ మీడియా కట్టుబాట్ల పరంగా  సమయం లేనందువ‌ల్ల చేయ‌లేక‌పోతున్నాను. నాకు కొంత స‌మ‌యం కావాలి. అందుకే విశ్రాంతి తీసుకున్నాను.  ఇప్పుడు నేను తిరిగి పని చేయ‌డం మొద‌లుపెట్టాను. నా కోసం ఎదురుచూస్తున్నందుకు ధన్యవాదాలు` అని తెలిపింది.
Tags:    

Similar News