ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే ఈ హర్టింగుల గోలేంటో..!
కరోనా నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై సినీ పెద్దలంతా సీనియర్ హీరో చిరంజీవి నేతృత్వంలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల సమస్యలు, ఇతర ఇబ్బందులపై చర్చించేందుకు చిరంజీవి ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించాల్సిన విషయాల మీద చిరంజీవి ఇంట్లో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు.
ఇందులో టాలీవుడ్ కు చెందిన అక్కినేని నాగార్జున - సోనాలి నారంగ్ - నారాయణ దాస్ నారంగ్ - అల్లు అరవింద్ - సురేశ్ బాబు - దిల్ రాజు - సుప్రియ - వి.వి.వినాయక్ - కొరటాల శివ - మెహర్ రమేశ్ - ఆర్.నారాయణమూర్తి - ఎన్వీ ప్రసాద్ - సి కళ్యాణ్ - కె.ఎస్.రామారావు - స్రవంతి రవి కిషోర్ - యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ - జెమిని కిరణ్ - భోగవల్లి బాబీ వంటి వారు హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్ పై పలువురు ఇండస్ట్రీ జనాలు హర్ట్ అయ్యారు.
టాలీవుడ్ సమస్యలపై చర్చించడానికి చిరంజీవి ఇంట్లో ఎలా సమావేశం ఏర్పాటు చేసారని.. కేవలం కొందరు హీరోలు అగ్ర నిర్మాతలను మాత్రమే పిలచారంటూ ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి ప్రైవేట్ హౌస్ లో ఇలాంటి మీటింగ్స్ పెట్టి.. విభజించి పాలించు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని.. ఆయన ఇంట్లో జరిగిన సమావేశానికి చిన్న నిర్మాతల్ని మిగతా హీరోలని ఎందుకు ఆహ్వానించలేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ కామెంట్స్ చేశారు.
తెలుగు ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే ఈ మనోభావాలు హర్టింగులు గోల ఏంటని సినీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా సమయంలో ఎక్కడో ఒక చోట.. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే ఇలాంటి కామెంట్స్ చేయడం సమంజసం కాదని అంటున్నారు. నిజానికి గత కాలంగా చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దాసరి నారాయణరావు మరణం తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉంది. కుటుంబాన్ని నడిపించడానికి ఎవరో ఒకరు కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి.. చిరు ఆ పని చేస్తూ వస్తున్నారు.
పాండమిక్ టైం లో షూటింగ్స్ లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి 'కరోనా క్రైసిస్ చారిటీ' ద్వారా విరాళాలు సేకరించారు. అలానే ఇండస్ట్రీ సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి షూటింగులు ప్రారంభించుకోడానికి అనుమతులు రావడానికి కృషి చేసారు. ఇప్పుడు అదే విధంగా ఏపీ ప్రభుత్వంతో భేటీ అవబోతున్నారు. వాస్తవానికి ఇండస్ట్రీ పెద్దలను తీసుకురావాలని చిరంజీవికి సీఎం జగన్ నుంచి ఆహ్వనం వచ్చింది. మొన్న మంత్రి పేర్ని నాని వచ్చి కలిసింది కూడా చిరంజీవినే. అందుకే ముందుండి చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదనేది సినీ అభిమానుల అభిప్రాయం.