40 కోట్లు కాదు.. 400 కోట్లు అడిగాడట
`డిటెక్టివ్ -2` దర్శకుడు మిస్కిన్ తో విశాల్ వివాదం గురించి తెలిసిందే. మాటా మాటా పెరిగి ఇద్దరి మధ్యా వార్ పీక్స్ కి చేరుకోవడం అది కాస్తా మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మిస్కిన్ తప్పటడుగులతో అనుచిత నిర్ణయాల వల్ల డబ్బుతో పాటు సమయం వృథా అవుతోందని అందువల్లనే మిస్కిన్ ని తప్పించినట్లు ప్రచారం సాగింది. అతని స్థానంలో విశాల్ కెప్టెన్సీ కి సిద్ధమై బ్యాలెన్స్ చిత్రీకరణ పూర్తిచేయనున్నాడన్న ప్రచారం సాగింది. యూనిట్ ని తనవైపుకు తిప్పుకుని ఎవరూ అధైర్య పడవద్దని విశాల్ సూచించారని ప్రచారం సాగింది.
తాజాగా ఈ వివాదంపై మరింత అప్ డేట్ అందింది. మిస్కిన్ కారణంగా బడ్జెట్ ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువైందిట. తొలుత ప్రతిపాదించిన బడ్జెట్ కి అదనంగా 40 కోట్లు కావాలని మిస్కిన్ అడిగాడుట. అప్పటికే బడ్జెట్ మంచి నీళ్లలా ఖర్చయ్యింది. ఇక మిస్కిన్ తో వేగలేక తనని సెట్ నుంచి బయటకు పంపించేసాడని కోలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కించాయి. దీంతో ఈ వివాదం పై మిస్కిన్ స్పందించాడు. అతడి వివరణలో ఛమత్కార ధోరణి బయటపడింది.
నేను 40 కోట్లు అడగలేదు. 400 కోట్లు అడిగాను. ఓ సన్నివేశంలో శాటిలైట్ నుంచి విశాల్ జంప్ చేయాల్సి ఉంటుంది. ఆ సన్నివేశానికి 100 కోట్లు అవుతుంది. ఆ బడ్జెట్ వల్లనే మరో 40కోట్లు అడిగాడు. అయితే మీడియా మీట్ లో మిస్కిన్ పరాచికం ఆడారు. 400 కోట్లు అడిగిన మాట వాస్తవమే అని వ్యంగ్యంగా స్పందించాడు. ఇక మిస్కిన్ ఎగ్జిట్ తర్వాత విశాల్ దర్శకత్వంలో చెన్నైలో కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. తొలి షెడ్యూల్ ని లండన్ లో పూర్తిచేసారు. మిస్కిన్ ఆధ్వర్యంలోనే అక్కడ షూటింగ్ అంతా జరిగింది. 50శాతం ఇప్పటికే పూర్తయింది. విదేశాల నుంచి చెన్నైకి షిప్ట్ కాగానే వివాదం మొదలైనట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే ఇలా అయ్యిందని అర్థమవుతోంది.