ప్రముఖ నటి.. తన జీవితం ముగించాలని ఎందుకు పోస్ట్ చేసింది..??

Update: 2020-07-23 16:47 GMT
ప్రముఖ కన్నడ సినీతార, డాన్సర్ జయశ్రీ రామయ్య ఇటీవల తన అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. జీవితం ముగించాలని ఉందని.. ప్రపంచానికి గుడ్ బై చెప్పాలని ఉందంటూ.. సోషల్ మీడియాలో నిరాశతో కూడిన పోస్ట్ చేసి అందరినీ టెన్షన్ పెట్టింది. నటిగా కంటే కూడా కన్నడ బిగ్ బాస్-3 కంటెస్టెంటుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది జయశ్రీ. అయితే ఒక్కసారిగా జీవితం ముగించాలని పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందారు. మరి అంత కష్టం ఈ భామకి ఏం వచ్చి ఉంటుంది..? అసలు ఏమైంది..? ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది..? అంటూ సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


కెరీర్ పరంగా ఏమైనా నిరాశ చెందిందా.. లేక పర్సనల్ ప్రాబ్లెమ్స్ ఏమైనా ఉన్నాయేమో అంటూ కామెంట్స్ చేస్తూ అడుగుతున్నారు. అయితే కాసేపటికి మళ్లీ జయశ్రీ.. "ఐయామ్ ఆల్రైట్ అండ్ సేఫ్.. లవ్ యూ" అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసాక అంతా కూల్ అయ్యారు. నిజంగా ఏమైనా చేసుకుంటుందేమో అని కంగారు పడ్డారు. అయితే జయశ్రీ గురించి ఆమె ఫ్రెండ్ అశ్రిత శెట్టి మాట్లాడింది. "కొంతకాలంగా జయశ్రీ డిప్రెషన్‌తో బాధపడుతోంది. ఆమె కుటుంబం నుండి కొన్ని ఇబ్బందులు ఉన్నాయట. అలాగే ప్రస్తుతం కెరీర్ పరంగా అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇదివరకు ఆమెను చాలాసార్లు నేను ఓదార్చాను.

కానీ ఇప్పుడు జయశ్రీ తరచుగా ఫోన్‌ నంబర్లు మారుస్తుండటంతో.. ఆమె గురించి తెలుసుకోవడం కష్టం అవుతుంది" ఆశ్రిత చెప్పింది. ఇదిలా ఉండగా.. జయశ్రీ గతంలో ఆస్తి విషయం పై తన మేనమామ శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషనులో ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత మీడియాతో కూడా "ఆస్తికి సంబంధించి మేనమామ చాలాకాలంగా తనతో పాటు తల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని.. ఊరికే ఇంటికి వచ్చి గొడవచేసి తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో పాటు తన వస్త్రాధరణపై అసభ్యకరంగా దూషించినట్లు చెప్పుకొచ్చింది. అటు కుటుంబం పరంగా మామ వేధింపులు, ఇటు కెరీర్ పరంగా అవకాశాలు లేక జయశ్రీ డిప్రెషన్ కి లోనై ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News