నేను ఫెయిలయ్యాను.. మెగా హీరో ఆనందం!

Update: 2021-01-07 10:23 GMT
మెగా హీరో వరుణ్‌తేజ్‌ కరోనా నుంచి బయటపడ్డారు. కొన్నిరోజుల క్రితం ఆయనతోపాటు ఆయన సోదరుడు, హీరో రామ్‌చరణ్‌ కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరూ వేర్వేరుగా హోం క్వారెంటైన్ లో ఉన్నారు. అయితే.. వారం రోజుల అనంతరం నిర్వహించిన పరీక్షలో తనకు నెగటివ్‌ రిపోర్ట్ వచ్చిందని వెల్లడించాడు వరుణ్.

కరోనా ఫలితంతో సంతోషంలో మునిగితేలుతున్నాడు వరుణ్. తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా వ్యక్తం చేశాడు. తనకు కరోనా  పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ప్రకటించని వరుణ్.. 'నెగటివ్‌ అనే రిపోర్టు ఇంత ఆనందాన్ని ఇస్తుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ ట్వీట్‌ చేశాడు. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

కాగా.. వరుణ్ కరోనా నుంచి బయటపడడంతో అందరి చూపు రామ్ చరణ్ పై పడింది. వాస్తవానికి వరుణ్ కన్నా ముందుగానే చరణ్ కరోనాకు గురయ్యారు. అయితే.. ఇప్పుడు వరుణ్ నెగటివ్ అంటూ రిపోర్టు వచ్చింది కానీ.. చెర్రీ సమాచారం మాత్రం తెలియరాలేదు. దీంతో.. రామ్ చరణ్ ఇంకా క్వారైంటైన్ లోనే ఉన్నాడని అనుకుంటున్నారు అందరూ.

వరుణ్ విషయంతో హ్యాపీగా ఉన్న మెగా అభిమానులు.. రామ్ చరణ్ గురించి తెలియకపోవడంతో కలవరానికి గురవుతున్నారు. రామ్‌చరణ్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. గత నెలలో మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తాను కరోనా పాజిటివ్ అని చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News