మోనాల్ లైఫ్ టర్న్ చేసిన ‘బిగ్ బాస్’.. బ్యూటీ యమా ఖుషీ
‘బిగ్ బాస్..’ స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ షోకు తెలుగు ప్రేక్షకులు అడిక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. దీంతో ఈ షోలో పాల్గొనేందుకు చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. బిగ్ బాస్ లో మెరుగైన ప్రదర్శన చేసిన వారికి సూపర్ పాపులారిటీ వస్తుంది. కంటిస్టెంట్ లు ఆరాాటపడేది కూడా ఇందుకోసమే. నిజానికి ఈ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న బిగ్ బాస్ 4లో సినీ హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఓ కంటిస్టెంట్ అన్నది తెలిసిందే. ఈ షో కొనసాగుతుండగానే ఆమె ఫేట్ మారుతోందని టాక్. మోనాల్ సినీ కెరీర్ మళ్లీ ఊపందుకోనుందనే సిచుయేషన్ కనిపిస్తోంది.
అందుతున్న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ప్రముఖ బ్యానర్‌లో రూపొందనున్న ఓ తెలుగు సినిమాకు సైన్ చేసిందట మోనాల్. అంతేకాకుండా.. స్టార్ మాలో ఒక డ్యాన్స్ షో చేసేందుకు కూడా అంగీకరించిందట ఈ బ్యూటీ. ఇది రియాలిటీ బేస్డ్ డ్యాన్స్ షో కానుందట. ఓ ప్రముఖ యాంకర్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇందుకోసం మోనాల్ కు పెద్దమొత్తంలో రెమ్యునరేషన్ ముట్టిందట.
సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీతో పాటు తెలుగులో మొత్తం ఐదు చిత్రాల్లో నటించిన ఈ గుజరాతీ భామకు చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రజలకు చాలా క్లోజ్ అయ్యారు. ఈ టర్న్ పట్ల ఫుల్ ఖుషీగా ఉందట మోనాల్. మరి, ఈ ఫేమ్ ను ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.