థియేట‌ర్స్ క్లోజ్ అయ్యాయి.. ఓటీటీలు విజృంభిస్తున్నాయి..!

Update: 2020-11-03 16:30 GMT
పండుగ వచ్చిందంటే కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇక దీపావళి వంటి కలర్ ఫుల్ ఫెస్టివల్ కి ప్రతి ఏడాది సరికొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. కాకపోతే ఈ ఏడాది దీపావళికి మాత్రం ఆడియన్స్ థియేటర్ ఎక్సపీరియన్స్ కి దూరంగా ఉండాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఎనిమిది నెలలుగా థియేటర్స్ మూతబడి ఉన్నాయి. అయితే ఈ మధ్యే కేంద్రం కొన్ని షరతులతో థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి అనుమతినిచ్చింది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా థియేట‌ర్స్ ఎప్పుడు తెరుస్తారో అనే దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ విజృంభిస్తున్నాయి.
 
థియేటర్లు మూతపడటంతో పెద్ద ప్రాజెక్టులను సైతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా కోసం థియేటర్ల వైపు చూసే జనాలు.. ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే కూర్చొని సినిమా చూసే వెసులుబాటుకి అలవాటు పడిపోయారు. ఈ నేపథ్యంలో న‌వంబ‌ర్ నెలలో చాలా సినిమాలు ఓటీటీలలో రిలీజ్ అవుతున్నాయి. మహానటి కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'మిస్‌ ఇండియా' చిత్రాన్ని నెట్‌ ఫ్లిక్స్‌ లో రేపు(నవంబర్ 4) విడుదల చేస్తున్నారు. న‌వంబ‌ర్ 6న 'గ‌తం' అనే సైకో థ్రిల్ల‌ర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల అవుతుంది. అలానే నవంబరు 12న స్టార్ హీరో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌ లో రిలీజ్ చేస్తున్నారు.

'Rx 100' బ్యూటీ పాయల్‌ రాజ్‌ పుత్ - చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'అనగనగా ఓ అతిథి' సినిమా 'ఆహా' లో నవంబరు 13న విడుదల కాబోతోంది. ఇదే క్రమంలో దీపావళి సందర్భంగా నవంబర్ 14న సిద్ధు జొన్నలగడ్డ - సీరత్‌ కపూర్‌ జంటగా నటించిన 'మా వింత గాధ వినుమా' సినిమా కూడా 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'అమ్మోరు త‌ల్లి' నవంబరు 14న డిస్నీ+హాట్‌ స్టార్‌ లో రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ తమ్మడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా న‌వంబ‌ర్ 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అలానే 'అంధకారం' అనే సినిమా నవంబరు 24న నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇలా నవంబర్ లో దాదాపుగా ప్ర‌తి శుక్ర‌వారం ఓటీటీ రిలీజులు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో అనే తిక‌మ‌క ఉండ‌టమే అని తెలుస్తోంది.
Tags:    

Similar News