హృతిక్ `బ్యూటిఫుల్ డేస్` హాలిడే
ప్రస్తుతం `సూపర్ 30` బయోపిక్ లో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. పాపులర్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ `సూపర్ 30` సృష్టికర్త - ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారిగా హృతిక్ నటిస్తోన్న బయోపిక్ ఇదే కావడం విశేషం. ఈ చిత్రం కోసం హృతిక్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఆ షూటింగ్ లో బిజీబిజీగా గడిపిన హృతిక్ కు కొద్ది పాటి విరామం దొరకడంతో ప్రస్తుతం హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన పిల్లలు హ్రెనాన్ - హ్రిధాన్ లతో కలిసి స్విట్జర్లాండ్ లో పర్వతారోహణ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలను హృతిక్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హృతిక్ లాగే అతడి తనయులకు కూడా అడ్వెంచర్స్ అంటే సరదా. దీంతో, తండ్రీ కొడుకులు కలిసి స్విట్జర్లాండ్ లో పర్వతాలు ఎక్కేస్తున్నారు. హ్రిధాన్ పర్వతం ఎక్కుతుంటే...హృతిక్ - హ్రెహాన్ లు కలిసి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ తర్వాత రోమ్ లో హ్రిదాన్ తో కలిసి తాను బైక్ రైడ్ చేశాడు.
ఆ రెండు వీడియోలను హృతిక్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. `బ్యూటిఫుల్ డేస్` అంటూ వాటికి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. పాపులర్ మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. 30 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ-జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేందుకు ఆనంద్ ప్రతి ఏటా శిక్షణనిస్తున్నారు. ఆయన జీవిత చరిత్రను వికాస్ బహ్ల్ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Full View