బుట్టబొమ్మ పూజా హెగ్డే క్రేజ్‌కి రెండేళ్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మ్యూజికల్ మ్యాజికల్ `అల వైకుంఠపురములో`. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బన్నీ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డుని సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించడమే కాకుండా వసూళ్ల పరంగా నాన్ బాహుబలి రికార్డుల్ని తిరగ రాసి సంచలనం సృష్టించింది. తమన్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలిచింది.
ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రానికి తమన్ అందించిన పాటలు ప్రధాన బలంగా నిలిచి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. రెండేళ్ల క్రితం సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా బన్నీ కెరీర్‌లో మర్చిపోలేని మూవీగా రికార్డుల కెక్కింది. ఈ చిత్రం విడుదలై సరిగ్గా నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ మూవీ విజయానికి తమన్ సంగీతం, బన్నీ నటన, త్రివిక్రమ్ మ్యాజిక్ ఎంత వరకు ప్లస్ అయిందో పూజా హెగ్డే గ్లామర్ కూడా అంతే ప్లస్ అయింది.
ఈ చిత్రంతో హీరో బన్నీ కెరీర్ తొలి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంటే పూజా హెగ్డే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా టాలీవుడ్ బుట్టబొమ్మగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ మూవీతో క్రేజీ హీరోయిన్ లని రేస్ లో వెనకకు నెట్టేసిన పూజా క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ సరికొత్త మార్కుని క్రియేట్ చేసింది. ఏ హీరోయిన్ కి దగ్గని రీతిలో ఈ సినిమాలో పూజా హెగ్డేని ప్రత్యేకంగా చూపించిన తీరు ఆమె స్టార్ స్టేటస్ ని దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ పెంచేసింది.
అంతకు ముందు హిట్ సినిమాలు తన ఖాతాలో వున్నా పూజా హెగ్డేకి స్టార్ స్టేటస్ ని అందించిన సినిమా మిత్రం `అల వైకుంఠపురములో` సినిమానే. ఈ మూవీ తరువాత ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె నటించిన `రాధేశ్యామ్` పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధం కాగా.. ఆచార్య, బీస్ట్ చిత్రాలు చిత్రీకరణ దశలో వున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ లోనూ రణ్ వీర్ సింగ్ తో కలిసి `సర్కస్` పేరుతో రూపొందుతున్న మూవీలోనూ నటిస్తోంది పూజ.
తనకు స్టార్ ఇమేజ్ ని అందించిన `అల వైకుంఠపురములో` చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ వార్తల్లో నిలిచింది పూజ. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ తనతో పంచుకున్న వీడియోలని రీపోస్ట్ చేసి సెలబ్రేషన్స్ లో పాల్గొంది. మరోసారి తన అబిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.