• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సైనా' బయోపిక్ ఎలా...

'సైనా' బయోపిక్ ఎలా ఉందంటే..!

By - Tupaki Desk
Update: 2021-03-26 17:30 GMT
భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనానెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా ''సైనా'' అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌ లో భారత్‌ కు కాంస్య పతకం తెచ్చిపెట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సైనా జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఆమె బయోపిక్ లో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా టైటిల్ రోల్ పోషించింది. మానౌవ్‌ కౌల్‌ - ఇషాన్‌ నఖ్వీ - మేఘనా మాలిక్‌ - సుబ్రజ్యోతి బరాత్‌ - అంకుర్‌ విశాల్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అమోల్‌ గుప్టే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. టి-సిరీస్‌ ఫిల్మ్స్‌ - ఫ్రంట్‌ ఫుట్‌ పిక్చర్స్‌ బ్యానర్స్ పై భూషణ్‌ కుమార్‌ - కృష్ణన్‌ కుమార్‌ - సుజయ్‌ జైరాజ్‌ - రాశేష్‌ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ ట్రైలర్లతో అంచనాలు పెంచేసిన 'సైనా' మూవీ ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సైనా నెహ్వాల్‌ ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా ఎలా ఎదిగింది.. ఆమె జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎలా ప్రభావితం చేశాయి.. ఒలింపిక్స్‌ లో పతకం సాధించే క్రమంలో ఆమెకు ఎలాంటి ప్రోత్సాహం లభించింది అనేది 'సైనా' సినిమాలో చూపించారు. క్రీడాకారుల జీవితాలను ఆధారంగా చేసుకుని అనేక బయోపిక్ వచ్చాయి. అయితే వాటిని డాక్యుమెంటరీ తరహాలో తీసినవి ఫెయిల్ కాగా.. కథలో భావోద్వేగాలు, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కలబోసి మెప్పించినవి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 'సైనా' ద్వారా ప్రేక్షకులను అలరించడంలో దర్శకుడు అమోల్‌ గుప్త సక్సెస్ అయ్యారని అంటున్నారు.

సైనా నెహ్వాల్ పాత్రలో పరిణీతి చోప్రా మెప్పించారు. సాధారణంగా బయోపిక్‌ లలో నటించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అందులోనూ క్రీడాకారుల జీవితాలైతే మానసికంగా శారీరకంగా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే పరిణితి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా కనిపించేందుకు కష్టపడిన తీరు వెండితెరపై కనిపించింది. సైనా హావభావాలతో గేమ్ ఆడుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి పీయూష్‌ షా కెమెరా పనితనం.. అమాల్‌ మాలిక్‌ సంగీతం మరో స్థాయికి తీసుకెళ్ళాయి. అయితే అందరికి తెలిసిన కథే కావడంతో సన్నివేశాలు రిపీటెడ్ గా వస్తున్నాయనే ఫీలింగ్ కలిగిస్తుంది. మొత్తం మీద 'సైనా' బయోపిక్ ప్రేక్షకులను మెప్పించిందని అర్థం అవుతోంది.


Tags:    
  • Saina biopic 
  • parineeti chopra 
  • Bollywood 
  • Tollywood 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS