• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆసక్తిరేపుతున్న హిట్-2...

ఆసక్తిరేపుతున్న హిట్-2 ఫస్ట్ లుక్ పోస్టర్..!

By - Tupaki Desk
Update: 2021-03-20 05:54 GMT
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో హిట్ సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ప్రకటించిన నాని.. తాజాగా హిట్-2 సీక్వెల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేసాడు. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన హిట్ ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయింది. అందుకే నాని మళ్లీ అదే ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్ తో సీక్వెల్ తీస్తున్నాడు. కానీ ఈసారి హీరో మార్పు.. హిట్ 2లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. అడవి శేష్ సైడ్ లుక్ లో సీరియస్ గా కనిపిస్తుండగా.. ఆ పక్కనే జర్మన్ షెపర్డ్ కుక్క కనిపిస్తుంది. ఆద్యంతం ఆసక్తిరేపుతున్న ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ నిర్మాత నాని 'కృష్ణదేవ్ అకా కేడి  ఆఫీసర్ ఆన్ బోర్డుకు స్వాగతం' అంటూ అడవి శేష్ కు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసాడు.

నాని ట్వీట్ కు స్పందిస్తూ.. 'హిట్ 2 రెండవ కేసు. హిట్2కేడి గా చాలా పెద్దది. నేను మేజర్ సినిమా పూర్తి చేసాక ఈ సినిమా షూట్ మొదలవుతుంది. కానీ ఇప్పటినుండి హీట్ మొదలైంది. నా ఫేవరేట్ హీరో నాని ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేసాడు అడవి శేష్. హిట్ సీక్వెల్ కూడా ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన శైలేష్ కొలను దర్శకత్వంలోనే హిట్-2 తెరకెక్కనుంది. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఈ సినిమా పై ఇంటరెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు మణికందన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. జాన్ స్టీవర్ట్ సంగీతం అందించనున్నాడు. వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి నిర్మిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని అటు హీరోగా.. ఇటు నిర్మాతగా రోజురోజుకి బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ షూటింగ్ లో ఉన్నాడు నాని. చూడాలి మరి హిట్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో!
Tags:    
  • Adivi Sesh As Krishna Dev 
  • Hit 2 First Look Poster 
  • Hit 2 First Look 
  • Adivi Sesh Movies 
  • Telugu News 

Similar News

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

Copyright @2026

Powered by Blink CMS