• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బతికి ఉండగానే నా...

బతికి ఉండగానే నా శ్రద్ధాంజలి ఫొటో నేను చూసుకున్నా

By - Tupaki Desk
Update: 2020-02-20 04:12 GMT
తెలుగు ప్రేక్షకులకు ఆనందం చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రేఖ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ ను దక్కించుకోవడంతో పాటు గుర్తింపును దక్కించుకుంది. అయితే ఈమెకు అదృష్టం కలిసి రాలేదు. ఆనందం చిత్రం తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా అవి నిరాశ పర్చాయి. మెల్ల మెల్లగా ఈమెకు ఆఫర్లే లేకుండా పోయాయి. గత కొంత కాలంగా సినిమాలకు పూర్తి దూరంగా ఉంటుంది. మళ్లీ ఛాన్స్‌ వస్తే నటించేందుకు సిద్దంగా ఉన్న రేఖ తాజాగా అలీ టాక్‌ షో లో పాల్గొంది.

వచ్చే వారంలో ప్రసారం కాబోతున్న ఈ టాక్‌ షోలో రేఖ పలు విషయాలను చెప్పినట్లుగా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది. రేఖతో అలీ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగిందనిపిస్తుంది. హీరోయిన్‌ గా ఉన్నప్పుడు సన్నగా ఉన్న రేఖ ఇప్పుడు కాస్త బొద్దుగా అయ్యింది. బొద్దుగా అయినా ముద్దుగానే ఉందంటున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రేఖ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.

గతంలో ఒకసారి రేఖ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అప్పుడు ఏకంగా శ్రద్ధాంజలి అంటూ ఫొటోలు పెట్టి దండలు కూడా వేశారు. ఆ విషయంపై స్పందిస్తూ ఆ అదృష్టం నాకు దక్కింది. బతికి ఉండగానే శ్రద్దాంజలి ఫొటోలు చూసుకునే అవకాశం ఎవరికి దక్కుతుంది చెప్పండి. అది నాకు దక్కిందంటూ సరదాగా కామెంట్‌ చేసింది. ఇక నాగార్జున గారిపై అభిమానంతో మన్మధుడు చిత్రంలో చిన్న పాత్రను చేశాను.

ఆ సినిమా సమయంలో నాగార్జున గారు నాకు ఒక ఆఫర్‌ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆయన నుండి కాల్‌ రాలేదు. ఇంకా కూడా ఆయన కాల్‌ కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. పూర్తి ఇంటర్వ్యూ లో మరెన్ని విషయాలను ఈ అమ్మడు షేర్‌ చేసుకుందో చూడాలి. 
Tags:    
  • Anandham Movie 
  • Heroine Rekha 
  • Tolywood Updates 
  • Movie Gossips 
  • Tollywood News 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS