• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి గొడవలోకి అతనూ...

సంక్రాంతి గొడవలోకి అతనూ వస్తాడంట

By - Tupaki Desk
Update: 2017-09-18 06:15 GMT
సంక్రాంతి పండక్కి ఐదారు నెలలుండగానే దాదాపు నాలుగు తెలుగు సినిమాలు రేసులోకి వచ్చేశాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కొత్త సినిమా జనవరి 10న.. మహేష్ బాబు-కొరటాల శివల ‘భరత్ అను నేను’.. రామ్ చరణ్-సుకుమార్ ‘రంగస్థలం’.. నందమూరి బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ కొత్త సినిమా సంక్రాంతినే లక్ష్యంగా చేసుకున్నాయి. వీటిలో తొలి రెండు సినిమాలకు డేట్లు కూడా ఇచ్చేశారు. వరుసగా జనవరి 10న పవన్ సినిమా.. 11న మహేష్ మూవీ విడుదలవుతాయని ప్రకటించారు. ‘రంగస్థలం’ కూడా సంక్రాంతి విడుదల అనే ప్రకటించారు. బాలయ్య సినిమా ప్రారంభోత్సవంలో కూడా సంక్రాంతి రిలీజ్ అనే చెప్పారు. ఐతే ఈ నాలుగూ వస్తేనే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టం. కనీసం ఒక్క సినిమా అయినా రేసు నుంచి తప్పుకోవాల్సిందే. ఐతే మన హీరోలకే ఇంత ఇబ్బందిగా ఉంటే.. సంక్రాంతి రిలీజ్ అంటూ ఓ తమిళ స్టార్ రెడీ అవుతున్నాడు. అతనే.. సూర్య.

ఈ ఏడాది ఆరంభంలో ‘సింగం-3’తో పలకరించిన సూర్య.. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘తానా సేంద్ర కూట్టం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘స్పెషల్ చబ్బీస్’కు రీమేక్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. ఇప్పుడేమో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ ఏంటో తెలిసిందే. అతడి సినిమాలు చాలా ఏళ్లుగా తమిళంతో పాటే తెలుగులోనూ మంచి క్రేజ్ మధ్య రిలీజవుతున్నాయి. ఇప్పుడు అతడి కొత్త సినిమాను మాత్రం తమిళంలో ముందు రిలీజ్ చేసి.. ఆ తర్వాత తెలుగులోకి తెచ్చే అవకాశం లేదు. ఐతే తమిళనాట సంక్రాంతి డేటు దొరికింది కదా అని ఉత్సాహంగా విడుదల తేదీ ప్రకటించేశారు. కానీ తెలుగులో సంక్రాంతికి ఉన్న పోటీ చూస్తే.. సూర్య సినిమాకు ఛాన్స్ లేనట్లే. కాబట్టి అతను డేటు మార్చుకుని రెండుచోట్లా ఒకేసారి రిలీజ్ చేస్తాడా లేక ముందు అక్కడ రిలీజ్ చేసి.. లేటుగా తెలుగులోకి తెస్తాడా అన్నది చూడాలి.


Tags:    
  • Hero Suriya 
  • Sankranti Festival Race 

Similar News

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

Copyright @2026

Powered by Blink CMS