• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అల వైకుంఠపురంలో' చాలా...

'అల వైకుంఠపురంలో' చాలా ముందున్నాడు

By - Tupaki Desk
Update: 2019-10-19 05:53 GMT
అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురంలో' చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విడుదలకు ఇంకా దాదాపుగా మూడు నెలలు ఉంది. షూటింగ్‌ కూడా ఇంకా చాలా బ్యాలన్స్‌ ఉంది. అయినా కూడా ప్రమోషన్స్‌ విషయంలో యూనిట్‌ సభ్యులు చాలా యాక్టివ్‌ గా ఉంటున్నారు. ఇప్పటికే సినిమాలోని బన్నీ లుక్‌ ను రివీల్‌ చేయడంతో పాటు పలు పోస్టర్‌ లను విడుదల చేయడం.. హీరోయిన్‌ పూజా హెగ్డే పోస్టర్‌ ను కూడా రివీల్‌ చేయడం జరిగి పోయింది.

సినిమా విడుదలకు వంద రోజులకు పైగా ఉండగానే సామజవరగమనా.. పాట విడుదల చేశారు. ఆ పాట ఎంతటి సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌ లో ఏకంగా 40 మిలియన్‌ ల వ్యూస్‌ ను సొంతం చేసుకున్న సామజవరగమనా పాట తర్వాత మరో పాటను విడుదల చేసేందుకు థమన్‌ రెడీ అయ్యాడు. సాదారణంగా అయితే సినిమా విడుదల దగ్గరకు వచ్చిన సమయంలో అంటే నెల రోజులకు అటు ఇటు ఇండగా పాటలను విడుదల చేస్తారు. కాని అల వైకుంఠపురంలో చిత్రం పాటల విడుదల విషయంలో మాత్రం చాలా ముందున్నారు.

ఇప్పటి నుండే సినిమాపై అంచనాలు పెంచే ఉద్దేశ్యంతో ఇలా పాటలను విడుదల చేస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రంతో పాటు విడుదల కాబోతున్న ఇతర చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇంకా ఏమాత్రం ప్రారంభం కాలేదు. కాని ఆ చిత్రాలతో పోల్చితే అల వైకుంఠపురంలో చిత్రం ప్రమోషన్‌ విషయంలో చాలా ముందుంది. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలను అందుకుని ఈ చిత్రం బన్నీకి సక్సెస్‌ ను ఇస్తుందా అనేది చూడాలి.
Tags:    
  • Allu Arjun 
  • Stylish Star 
  • Trivikram Srinivas 
  • Sankranthi 
  • Ala Vaikuntpuram Lo 
  • First Single 
  • Tupaki Updates 
  • Tupaki News 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS