కటకటాల వెనక్కు లేడీ ప్రొడ్యూసర్

Update: 2018-12-09 07:52 GMT
నేరస్థులు ఎంత పెద్ద వారైనా సినిమా బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఎంతున్నా ఏదో ఒకరోజు చట్టానికి దొరక్క తప్పదు. కాకపోతే ఇండస్ట్రీ కి సంబంధించి ఎక్కువగా నేరాల్లో కనిపించేది మగవారే. అందుకే ఈ ట్రెండ్ ని బ్రేక్ చేద్దామని కాబోలు ఓ మహిళా నిర్మాత కేసులో ఇరుక్కుని ఊచలు లెక్కబెడుతోంది. క్రిఆర్జ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ అధినేత ప్రేరణ అరోరా ఆర్థిక నేరాల అభియోగం మీద డిసెంబర్ 10 దాకా రిమాండ్ ని పొడిగించుకుని విచారణను ఎదురుకుంటోంది. ప్రముఖ నిర్మాత విసు భగ్నానీ చేసిన ఆరోపణల మేరకు కోర్టు కేసు ను విచారిస్తోంది.

ఈ ఏడాది విడుదలైన బత్తి గుల్ మీటర్ చాలు-ఫన్నే ఖాన్ లాంటి క్రేజీ సినిమాల హక్కులు తనకే ఇప్పిస్తానని చెప్పాయి సొమ్ము రూపంలో 32 కోట్ల రూపాయలు తీసుకుని తనను నిలువునా మోసం చేసిందని ప్రేరణ మీద విసు కంప్లయింట్. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విభాగం తనను అదుపులోకి తీసుకుని కేసుని లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తోంది. అయితే ప్రేరణ అరోరా మీద ఇలాంటి ఆరోపణలు ఇది మొదటిసారి కాదు. ఆ మధ్య వచ్చిన జాన్ అబ్రహం పరమాణతో పాటు రెండు రోజుల క్రితం విడుదలైన కేదార్ నాథ్ విషయంలోనూ ఈవిడకు వివాదాలు ఉన్నాయి.

అసలు ఒక లేడీ ని నమ్ముకుని అన్నేసి కోట్ల రూపాయల డబ్బులు గంపగుత్తగా ఎలా ఇస్తున్నారా అనే ఆశ్చర్యం కలగక మానదు. చీటింగ్ కేసులు భారీ గా నమోదు కావడంతో ప్రేరణ అరోరా చుట్టూ వలయం గట్టిగానే ఉంది. తన దగ్గరున్న హక్కులను ఒకరి దగ్గర సొమ్ములు పుచ్చుకుని మరొకరికి అమ్మడం గురించే వివాదం తీవ్రంగా నడుస్తోంది. అన్ని రుజువైతే ముంబై కారాగారంలో ఎక్కువ కాలం గడిపే సూచనలు ఉన్నాయట.
Tags:    

Similar News