మంచి సినిమాలు.. హరీష్ ఆవేదన
మంచి సినిమాలు తీయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని.. కానీ ఆ సినిమాల్ని ప్రేక్షకులు ఆదిరిస్తారన్న గ్యారెంటీ లేదని అంటున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. దర్శకులు తమ భావుకతని ప్రేక్షకుల మీదికి రుద్దుతామంటే కుదరదని.. ప్రేక్షకుల అభిరుచి మేరకే సినిమాలు తీయాల్సి ఉంటుందని అతనన్నాడు. తాను కూడా ‘షాక్’ లాంటి మంచి సినిమా తీసి ఎదురు దెబ్బ తిన్నానని.. ఇంకా కొంతమంది దర్శకులు తీసిన మంచి సినిమాలు సరిగా ఆడలేదని హరీష్ చెప్పాడు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాల్ని ఆదరిస్తారో అర్థం చేసుకుని వాళ్ల అభిరుచి మేరకు సినిమాలు తీయడమే దర్శకుల పని అని అన్నాడు.
‘‘దర్శకులు కమర్షియల్ సినిమాల మీద ఆసక్తి చూపించడానికి వేరే కారణాలేమీ లేదు. హీరో వంద మందిని చంపితే ప్రేక్షకులు ఆ సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు. అది ఇండస్ట్రీ రికార్డు అయింది. కానీ మంచి సినిమాలనుకున్నవి చాలా వరకు ఆడలేదు. నేను కమర్షియల్ గా ఆలోచించకుండా రియలిస్టిక్ గా అనిపించే కథాంశంతో ‘షాక్’ సినిమా తీశాను. నన్ను నాలుగేళ్లు ఇంట్లో కూర్చోబెట్టారు. రవితేజ నా ఆటోగ్రాఫ్ అనే మరో మంచి సినిమా తీశాడు. కానీ దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించలేదు. శంభో శివ శంభో కూడా మంచి సినిమానే. దానికీ అలాంటి ఫలితమే వచ్చింది. ఇక ఈ ఏడాది మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మీద అందరూ ప్రశంసలు కురిపించారు. గొప్ప సినిమా అన్నారు. కానీ అదీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మిగతా భాషల్లో లాగే మంచి సినిమాల్ని - ప్రయోగాత్మక చిత్రాల్ని బ్లాక్ బస్టర్లు చేస్తే అప్పుడు దర్శకులందరూ మారతారు. అలాంటి సినిమాలే తీస్తారు. ప్రేక్షకుడికి ఏదిష్టమో.. ఎలాంటి సినిమాల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారో వాటిని అందించడమే మా పని’’ అన్నాడు హరీష్.