తమన్నా మూవీ ఆగిపోలేదని చెప్పడం కోసం స్టార్‌ హంట్‌

Update: 2020-11-02 17:40 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా.. ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్‌ జంటగా గుర్తుందా శీతాకాలం అనే సినిమా మొదలు అయిన విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో మంచి కాన్సెప్ట్‌ లను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్న సత్యదేవ్‌ ఈసారి కన్నడంలో హిట్‌ అయిన లవ్ మాక్‌ టైల్‌ ను రీమేక్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. ప్రారంభం అయిన కొన్ని రోజులకే ఈ సినిమా బడ్జెట్‌ కారణంగా ఆగిపోయింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారంను తిప్పి కొట్టేందుకు గాను చిత్ర యూనిట్‌ సభ్యులు స్టార్ హంట్‌ అంటూ ప్రకటన ఇచ్చారు.

ఈ సినిమాలో హీరో సత్యదేవ్‌ పాత్ర చిన్నప్పటి పాత్రలో నటించేందుకు గాను 12 నుండి 15 ఏళ్ల మద్య కుర్రాడు కావాలంటూ పేర్కొన్నారు. యంగ్‌ సత్యదేవ్‌ పాత్ర కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయని ఆసక్తి కలిగిన వారు ఫొటోలను పంపించండి అంటూ మెయిల్‌ ఐడి కూడా ఇచ్చారు. ఈ ప్రకటనతో సినిమా ఆగిపోలేదు అంటూ క్లారిటీ వచ్చేసింది.

ఇదే సమయంలో సినిమా నుండి తమన్నా తప్పుకుంది అంటూ వచ్చిన వార్తలకు కూడా ఈ ప్రకటనతో సత్యదేవ్‌ క్లారిటీ ఇచ్చాడు. తన ట్వీట్‌ లో తమన్నాను కూడా ట్యాగ్‌ చేయడంతో ఆమె తప్పుకోలేదు అంటూ తేలిపోయింది. మొత్తానికి స్టార్‌ హంట్‌ అంటూ రెండు పుకార్లకు చెక్‌ పెట్టారు. ఈ సినిమాను త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ కు తీసుకు వెళ్లబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
Tags:    

Similar News