ట్రైలర్ టాక్: బాగా నాటుగా ఉన్న టాకీస్
ప్రవీణ్ సత్తారు అంటే ఓ రేంజ్ ఎక్స్ పెక్ట్ చేసేంతగా ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ గుంటూరు టాకీస్ అంటూ ఓ మూవీ స్టార్ట్ చేయగానే హైప్ మొదలైంది. యాంకర్ రష్మీ, శ్రద్ధాదాస్ లను లీడ్ రోల్స్ లో తీసుకోవడంతో ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. చాలాకాలం క్రితమే పోస్టర్స్ కూడా వేసినా.. ఈ మూవీ సంగతులు చాన్నాళ్లు బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం రిలీజ్ కి రెడీ చేస్తున్నారు యూనిట్.
ఇప్పుడు గుంటూరు టాకీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. గత వారంలో టీజర్ వచ్చినపుడే కాన్సెప్ట్ పై ఓ ఐడియా వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ లో ఫుల్లు ప్లెడ్జెడ్ గా చెప్పేశారు. చోరీకి సంబంధించిన ఎపిసోడ్ పై ఆడిన విలేజ్ బ్యాక్ డ్రాప్ థీమ్ చుట్టూ కథ రాసుకున్నారు. నరేష్, సిద్ధూలు దొంగలుగా బాగానే జీవించేశారు. దొంగలరాణి కేరక్టర్ లో శ్రద్ధాదాస్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక రష్మీ గౌతమ్ అంతే.. సెక్సీ ఫీలింగ్స్ ని ఒక ఒలికించేసింది. యాక్టింగ్ లో తన్మయత్వాన్ని బాగా చూపించింది.
మొత్తం మీద అన్ని యాంగిల్స్ లోనూ గుంటూరు టాకీస్ ఆకట్టుకునేలాగే ఉంది. ప్రధానంగా పల్లెటూరి సరసాలు, దొంగతనాలకు.. దొంగల ముఠా ఎపిసోడ్ ని మిక్స్ చేయడం బాగానే కుదిరింది. విజువల్స్ పరంగా కూడా మంచి మాస్ ఎపిసోడ్స్ ని బాగా పిక్చరైజ్ చేశారు. ఈ మూవీతో కమర్షియల్ హిట్ కొట్టడం, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకి ఇప్పుడు చాలా ముఖ్యం. మరోవైపు రష్మీ కూడా గుంటూరు టాకీస్ పై చాలానే ఆశలు పెట్టుకుంది.
Full View