• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిక్కుల్లో గుంజ‌న్...

చిక్కుల్లో గుంజ‌న్ స‌క్సేనా.. లింగ వివ‌క్ష‌తో చిక్కులే!

By - Tupaki Desk
Update: 2020-08-29 06:00 GMT
జాన్వీ క‌పూర్ న‌టించిన `గుంజ‌న్ స‌క్సేనా:  ది కార్గిల్ గ‌ర్ల్` చిత్రం సెప్టెంబ‌ర్ లో డిజిట‌ల్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ వీక్షించాక ర‌క‌ర‌కాల అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. భార‌తీయ వైమానిక ద‌ళ అధికారుల త‌ర‌పున చిత్ర నిర్మాత‌లపై ఓ ఎన్జీవో సంస్థ‌ కోర్టు కేసు వేయ‌డం వేడెక్కించింది. ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగుతోంది. గంజన్ సక్సేనా రిలీజ్ ని ఆపాల‌ని.. ఇందులో అవాస్త‌వికంగా చిత్రీక‌రించిన స‌న్నివేశాల్ని తొల‌గించాల‌ని.. అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు తాజాగా ఆదేశించింది.

న్యాయవాది అమిత్ కుమార్ శర్మ ఈ కేసు విష‌య‌మై పోరాడుతున్నారు. ఆయ‌న‌కు చెందిన ఎన్జీవో.. జస్టిస్ ఫర్ రైట్స్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ప్రతిష్టాత్మక భారతీయ వైమానిక దళా(ఐఎఎఫ్) న్ని ప‌ర‌మ చెత్త‌గా స‌న్నివేశాల్లో చిత్రీకరించినట్లు ఆరోపణలు వ‌చ్చాయి. అందుకే ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ చిత్రంలోని అభ్యంతరకరమైన సంభాషణలు సన్నివేశాలను సవరించడానికి లేదా తొలగించాలని పిటిషన‌ర్ వాదించ‌గా.. కోర్టు ఆ మేర‌కు ఆదేశాలను జారీ చేసింది.

సృజనాత్మకత‌.. కళాత్మక స్వేచ్ఛ పేరుతో భారత వైమానిక దళాన్ని అనవసరమైన రాంగ్ వేలో చిత్రీకరించ‌డం స‌రికాదు.ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు సంభాషణలు వాస్తవంగా తప్పుదారి పట్టించేవిగా చిత్రీకరించారు. మాజీ ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా వెండితెర పాత్రను కీర్తింపజేయడానికి మేల్ అధికారుల్ని బ‌లి పెట్టారు.. అని పిటిష‌న‌ర్ వాదించారు.

అంతేకాదు వైమానిక ద‌ళంలో మగ అధికారులను మిసోజినిస్టులుగా తెర‌పై చూపించారు. అందుకే ఆయా స‌న్నివేశాల‌న్నిటినీ విడుదలకు ముందే ధర్మ ప్రొడక్షన్స్ తొలగించాలని కోర్టు కోరింది. IAF ను ప్రతికూల విధానంలో చిత్రీకరించే అభ్యంతరకరమైన దృశ్యాలు ఉండ‌కూడ‌ద‌ని తెలిపింది. ఈ చిత్రంలో చిత్రీకరించిన లింగ వివక్ష ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.  తప్పుడు విధానంలో తప్పుదోవ పట్టించేదిగా మేల్ అధికారుల్ని చూపార‌ని న్యాయ‌వాది త‌న వాద‌న‌లో పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకమైన భారత వైమానిక దళం సంస్థలో లింగ వివ‌క్ష కేవ‌లం తటస్థంగా ఉందని  మగ - ఆడ అనే తేడా లేకుండా మహిళా సిబ్బందికి సమాన అవకాశాన్ని ఎల్లప్పుడూ కల్పించిందని పిటిషన‌ర్ తెలిపారు. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) అత్యధిక సంఖ్యలో మహిళా అధికారులను ఎంపిక చేసుకుని పనిచేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. 2015 లో యుద్ధంలో మహిళా అధికారులకు భారతీయ వైమానిక దళం అవ‌కాశం క‌ల్పించింద‌ని గుర్తు చేశారు.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS