ఫేమస్ స్టైలిస్ట్ డైరెక్టర్ అవ్వబోతున్నాడట
బాలీవుడ్ సెలబ్రెటీల ఫేవరేట్ స్టైలిస్ట్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లామర్ వరల్డ్ పై కాస్త అవగాహణ ఉండి.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే ప్రతి ఒక్క ఇండియన్ కు ఈ పేరు ప్రముఖంగా పరిచయమే. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసే డ్రస్ ల కోసం ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బాలీవుడ్ స్టార్స్ తో పాటు అత్యంత ప్రముఖమైన సెలబ్రెటీలతో మాత్రమే ఈయన డీలింగ్స్ జరుగుతూ ఉంటాయి. బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల వివాహాది శుభకార్యాలకు కూడా ఈయన మాత్రమే కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేస్తాడనే టాక్ ఉంది.
ఇండియన్ సినీ అభిమానులకు సుపరిచితుడు అయిన మనీష్ మల్హత్రా మరింతగా ప్రేక్షకులకు చేరు అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈయన్ను స్టైలిస్ట్ గానే చూశాం. కాని ఇక మీద ఈయన్ను డైరెక్టర్ గా చూడబోతున్నాం. ఈయన డిజైన్స్ ఎంత అద్బుతంగా ఉంటాయో.. ఈయన చేయబోతున్న సినిమాలు కూడా అంతే అద్బుతంగా ఉంటాయేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్ గా దేశ వ్యాప్తంగా సెలబ్రెటీలకు మోస్ట్ వాంటెడ్ గా పేరు దక్కించుకున్న ఈయన దర్శకుడిగా పరిచయం అవ్వడానికి ఇప్పటికే ఒక మంచి లవ్ స్టోరీని సిద్దం చేసుకున్నాడట. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.
బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు ఈయనకు అభిమానులు ఉన్నారు. కనుక ఈయన అడిగితే కాదనుకుండా సినిమా చేసే హీరో మరియు హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. కనుక ఈయన చిన్నా చితకా హీరోలు హీరోయిన్స్ తో కాకుండా స్టార్స్ తోనే సినిమా ను చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ సినిమా ను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. బాలీవుడ్ స్టార్ మేకర్ గా ఈయనకు పేరు ఉంది. ఎంతో మంది స్టార్ కిడ్స్ ను హీరోలుగా హీరోయిన్స్ గా పరిచయం చేసిన ఘనత ఈయనది.
ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో పలువురు ఈయన కంపెనీ నుండి బయటకు వచ్చిన వారే అనడంలో సందేహం లేదు. అందుకే ఈయన్ను స్టార్ మేకర్ అంటారు. అలాంటి స్టార్ మేకర్ చేతిలో పడటం వల్ల ఈయనకు మంచి ఫ్యూచర్ ఉంటుందని కొందరు అంటున్నారు. కరణ్ జోహార్ బ్రాండ్ ఇమేజ్ మరియు మనీష్ మల్హోత్రా పేరుతో రాబోతున్న సినిమా ఖచ్చితంగా సంచలనంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని వివరాలు ఒకటి రెండు వారాల్లో వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. యంగ్ హీరో ఒకరు ప్రస్తుతం ఈ సినిమా కోసం సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. అన్ని విషయాలు అతి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్టైలిస్ట్ గా దేశంలోనే నెం. 1 అయిన మనీష్ దర్శకుడిగా మంచి పేరు దక్కించుకుంటాడా చూడాలి.