ఎక్కడికక్కడే గ్యాంగులు తయారయ్యారు

Update: 2016-05-30 17:30 GMT
ఇప్పుడు ఫిలిం నగర్‌ లో వినిపిస్తున్న అతిపెద్ద న్యూస్‌ ఏంటంటే.. కోటరీలు.. గ్యాంగులూ.. గ్రూపులూ. ఎక్కడికక్కడే కొన్ని గ్యాంగులు తయారై.. అవి అందరినీ అనిచేస్తున్నాయి. ఎలాగా అంటారా??

ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. అక్కడ చాలామంది హీరోలు ఉన్నారు. కాని ఆ హీరోలను కలవాలంటే.. వాళ్లకు బాగా దగ్గరైన కొన్ని భజన బ్యాచ్‌ లు ఉంటాయి. వాళ్లని ముందు కలవాలి. అందులో కొంతమంది వారికి పర్సనల్ పి.ఆర్.లా కూడా పనిచేస్తుంటారు. సదరు హీరోను కలసి కథ చెప్పి డైరక్షన్‌ చేయడమో.. లేదంటే ఇంకేదో ప్రయోజనం పొందడమో అటుంచితే.. ముందు ఈ భజన బ్యాచ్‌ లోని అందరినీ సార్‌ అనాలి. అనకపోతే వారు ఇక్కడే మనల్ని కట్‌ చేస్తారు. వీరిని మోసుకుంటూ మోసుకుంటూ.. మనం హీరో దగ్గరకు వెళితే.. అక్కడి దొరికేది ఓ ఐదు నిమిషాలు. అందులో ఓ మూడు నిమిషాలు ఈ భజన బ్యాచ్‌ మన తరుపున ఏదో రెండు మాటలు చెబుతారు. పోనివ్ ఈ గ్యాంగ్‌ ను ఓవర్ టేక్‌ చేసి వెళదాం అంటే.. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. వీరు మనల్ని రీచ్‌ అవ్వనివ్వరు. ఆ హీరోలూ ఈ గ్యాంగ్‌ లోని వారే గొప్పోళ్ళు.. మనల్ని కాపాడే మంచోళ్లు.. మన చుట్టూ ఉన్న మన మనుషులూ అనుకుంటూ ఉంటారు.

క్రియేటివ్‌ గా కథ రాసుకున్న అసిస్టెంట్‌ డైరక్టర్‌ అయినా.. కథ చెప్పడానికి వెళ్లి వీరికి సలామ్‌ కొట్టాల్సిందే. ఇక కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారం చేసే బిజినెస్ మ్యాన్‌ అయినా కూడా.. ఈ గ్యాంగులకు గులామ్‌ గిరీ చేయాల్సిందే. టాలీవుడ్‌ లో నే ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏడ్చింది. సరైన హిట్లు కొట్టేశాం అనకుంటారు కాని.. తమ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోలేరు ఆ హీరోలు!!!
Tags:    

Similar News