`గబ్బర్ సింగ్` రౌడీని ఢీకొట్టిన కార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `గబ్బర్ సింగ్` సంచలనాల గురించి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. మూవీ విజయంలో అంత్యాక్షరి ఎపిసోడ్ ఎలాంటి భూమికను పోషించింది. ఈ ఎపిసోడ్ లో నటించిన జనియర్ రౌడీ ఆర్టిస్ట్ లు పాపులర్ అయ్యారు. ఆ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ గ్యాంగ్ పేరుతో సినిమాలు వచ్చాయి. ఇక వీళ్లలో ఒకడు.. యాంగ్రీ హీరో రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ ``రోజా పువ్వా ...`` అంటూ చిందులేసిన ఆంజనేయులుకు మంచి గుర్తింపు లభించింది. రౌడీ బ్యాచ్ ఆంజనేయులు శనివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లోని కృష్ణానగర్ సమీపంలో గల ఇందిరా నగర్ లో నివాసం వుంటున్న ఆంజనేయులు తన భార్యతో కలిసి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా గచ్చిబౌలి వెతుండగా ఊహించని ప్రమాదం జరిగింది.
బైక్ పై వెళుతున్న అతన్ని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో గుర్తు తెలియని ఓ కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో అతని ఎడమ చేయి, ఎడమకాలికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతని భార్య స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారు వెంటనే దగ్గరలో వున్న ఆసుపత్రికి ఆంజనేయులు, అతని భార్యను తరలించి వైద్యం చేయించారు.
తాజా సమాచారం ప్రకారం.. ప్రమాదం అనంతరం ఆంజనేయులు గుర్తు తెలియని కారుని పోలీసుల సాయంతో చివరికి ఏదోలా పట్టుకున్నారట. ప్రమాదానికి కారకుడిని గుర్తించి తమకు న్యాయం చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు తాజాగా దర్యాప్తు చేపట్టారని తెలుస్తోంది.