యుఎస్ లో తేజుకి చుక్కెదురు

Update: 2019-04-13 05:49 GMT
నిన్న విడుదలైన సాయి తేజ్ చిత్రలహరి తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్స్ తోనే మొదలైంది. ఆరు వరస డిజాస్టర్ల తర్వాత చేసిన మూవీనే అయినప్పటికి ప్రమోషన్ వల్ల జనానికి ఆసక్తి రేపడంలో యూనిట్ సక్సెస్ అయ్యింది. అయితే వస్తున్న డివైడ్ టాక్ యుఎస్ నుంచి అందుతున్న కలెక్షన్ రిపోర్ట్స్ తేజుకు మరో ఫ్లాప్ కట్టబెట్టేలా ఉన్నాయని ట్రేడ్ మాట. యుఎస్ ప్రీమియర్ల నుంచి కేవలం $63K మాత్రమే వసూలు చేసిన చిత్రలహరి ఆపై పెద్దగా పికప్ చూపించలేదని ఫిగర్స్ చెబుతున్నాయి.

పూర్తి లెక్కలు రావడానికి ఇంకొంత టైం పడుతుంది కాని ఓపెనింగ్ మాత్రం ఆశాజనకంగా లేదనే మాట వాస్తవం. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కార్తిక ఘట్టమనేని కెమెరా అన్ని మంచి స్టాండర్డ్ లో ఉన్నప్పటికీ కీలకమైన కథా కథనాల్లో బలమైన ఎమోషన్ లేకపోవడంతో అక్కడి ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు

సో యుఎస్ రిజల్ట్ ప్రకారం చూసుకుంటే తేజుకు ఏడు మైత్రి సంస్థకు మూడో ఫ్లాప్ ఖాయమైనట్టే. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మైత్రికి సవ్యసాచి-అమర్ అక్బర్ అంటోనీలు తీవ్ర నష్టాలు ఇచ్చాయి. ఓవర్సీస్ లో మరీ దారుణంగా. ఇప్పుడు చిత్రలహరి సైతం అదే దారిలో ఉన్నప్పటికీ వాటి కంటే కొంత మెరుగ్గా ఉండవచ్చేమో కాని బిజినెస్ పరంగా లాస్ వెంచరే అయ్యేలా ఉంది.

ఇక్కడి పరిస్థితి గురించి అంచనా వేయాలంటే కనీసం సోమవారం దాకా ఆగాలి. మజిలి లాగా మెజారిటీ వర్గాల నుంచి పాజిటివ్ టాక్ రాబట్టుకోలేకపోవడం చిత్రలహరికి మైనస్ గా నిలుస్తోంది. ఇంకో రెండు మూడు రోజులు ఆగితే ఫుల్ క్లారిటీతో తేజు అపజయ యాత్రకు బ్రేక్ పడిందో లేదో చూసుకోవచ్చు



Tags:    

Similar News