పవన్ ఫ్యాన్స్ ఆకలిని హరీష్ తీర్చేనా?
పవన్ కళ్యాణ్ నుండి మాస్ మసాలా సినిమాను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి ఒక ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైన్మెంట్ కోసం ఫ్యాన్స్ కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ సినిమాలు చేయడేమో అనుకుంటూ ఉండగా వరుసగా మూడు సినిమాలను పవన్ ఒప్పుకుడున్నాడు. మొదటిది పింక్ రీమేక్ కాగా అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కష్టం. ఇక ఆ తర్వాత సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
క్రిష్ మూవీలో మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉండటం అనుమానమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ చేయబోతున్న 28వ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు కనుక ఫ్యాన్స్ అంతా కూడా ఈ రెండు సినిమాలు వదిలేసి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నారు.
గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత మళ్లీ వీరి కాంబో మూవీ అనగానే అంచనాలు పీక్స్ కు వెళ్లాయి. పవన్ కు వీరాభిమాని అని చెప్పుకునే హరీష్ శంకర్ ఫ్యాన్స్ పవన్ ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడం తెలుసు. ఖచ్చితంగా మళ్లీ పవన్ తో గబ్బర్ సింగ్ స్థాయి మాస్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించడం ఖాయం అంటు ఫ్యాన్స్ నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తనకున్న సమయంను పూర్తిగా వినియోగించుకుని దర్శకుడు హరీష్ శంకర్ కథను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఉన్న మాస్ మసాలా ఆకలిని తీర్చాలంటే గబ్బర్ సింగ్ స్థాయి ఎంటర్ టైనర్ కావాలి. మళ్లీ హరీష్ శంకర్ అలాంటి సినిమాతో వస్తే ఫ్యాన్స్ ఆయన్ను నెత్తిన పెట్టుకోవడం ఖాయం. పవన్ కళ్యాణ్ తో మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ తప్పకుండా ఒక మంచి మాస్ మసాలా మూవీని ఇస్తాడని అంతా నమ్ముతున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ ఆకలి హరీష్ శంకర్ మూవీ తో తీరేనా చూడాలి.