మెగా కానుక ఉంటుందా అని ఫ్యాన్స్ లో ఆత్రం

Update: 2020-10-08 05:15 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. కొరటాల శివ దర్శకత్వం వ‌హిస్తున్నారు.  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఇదివ‌ర‌కూ మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే కానుక‌గా రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ ర్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. టీజ‌ర్ వ‌స్తే ఎంత బావుంటుందో! అంటూ ఊరించింది మెగాభిమానుల్ని.

అయితే అందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైందా?   కొర‌టాల బృందం టీజ‌ర్ ఏదైనా రిలీజ్ చేస్తారా?  ఇత‌ర నిర్మాత‌ల్లానే ప్ర‌చారానికి తెర తీస్తారా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌కు లైన్ క్లియ‌ర్ అయిపోతుండ‌డంతో ఇక‌పై వ‌రుస‌గా సినిమాల్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. లాక్ డౌన్ వ‌ల్ల ఐదారు నెల‌లుగా థియేట‌ర్లు తెరుచుకోని స‌న్నివేశం. దీని నుంచి ఇక బ‌య‌ట‌ప‌డేందుకు ఆస్కారం ల‌భించ‌నుంది.

ఇత‌ర టాప్ హీరోల్లానే చిరంజీవి కోసం టీజ‌ర్ రెడీ చేస్తారా?   లేదా అంటే..అందుకు ఆస్కారం క‌నిపించ‌డం లేద‌ట‌. పైగా ఆచార్య షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. అది పూర్త‌యితే కానీ ప్ర‌చారం ప‌రంగా వేగం పెంచేందుకు ఆస్కారం లేదు. ఇత‌రుల్ని చూసి కొరివితో గోక్కోవ‌డం స‌రికాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంద‌ట‌. అయితే ఇలాంటి నిర్ణ‌యం ఎప్పుడూ మెగాభిమానులకు రుచించ‌దు. బాస్ ఎప్పుడూ ఆన్ లైన్ లో ట‌చ్ లో ఉండాల‌ని కోరుకుంటారు. మ‌రి చిరు టీమ్ ప్లాన్ మారుతుందేమో చూడాలి.
Tags:    

Similar News