ఈసారి స్టార్‌ హీరోతో దర్శకద్వయం వెబ్‌ సిరీస్‌

Update: 2020-10-14 09:10 GMT
బాలీవుడ్‌ ప్రముఖ దర్శకద్వయం రాజ్ అండ్‌ డీకేలు ఓటీటీ లో దూసుకు పోతున్నారు. ఈమద్య కాలంలో ఇండియన్‌ వెబ్‌ సిరీస్‌ అంటే ఠక్కున వినిపించే పేరు ది ఫ్యామిలీ మెన్‌. హాలీవుడ్‌ సినిమాల రేంజ్‌ లో ఈ వెబ్‌ సిరీస్‌ ను ఈ దర్శక ద్వయం తెరకెక్కించారు. ప్రస్తుతం వీరిద్దరు ది ఫ్యామిలీ మెన్‌ 2 వెబ్‌ సిరీస్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఫ్యామిలీ మెన్‌ 2 రాబోతుంది. ఆ వెంటనే వీరు చేయబోతున్న ప్రాజెక్ట్‌ ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది.

ఫ్యామిలీ మెన్‌ వెబ్‌ సిరీస్‌ ను మనోజ్‌ బాజ్‌ పెయితో తెరకెక్కించిన రాజ్‌ అండ్‌ డీకేలు తమ తదుపరి వెబ్‌ సిరీస్ ను బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. లాక్‌ డౌన్‌ టైంలో షాహిద్‌ కోసం వెబ్‌ సిరీస్‌ కథను కూడా రెడీ చేసి వినిపించడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట. వచ్చే ఏడాది ఆరంభంలోనే వెబ్‌ సిరీస్‌ ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. బాలీవుడ్‌ లో ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ ల హవా కొనసాగుతుంది.

ఇలాంటి సమయంలో స్టార్‌ హీరోలు కూడా వెబ్ సిరీస్‌ ల వెంట పడుతున్నారు. ఇప్పటికే హృతిక్‌ రోషన్‌ కూడా ఒక వెబ్‌ సిరీస్‌ లో నటించబోతున్నాడు. ఆ దారిలోనే రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో షాహిద్‌ కపూర్‌ సైతం వెబ్‌ సిరీస్‌ లో నటించబోతున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందబోతున్న వెబ్‌ సిరీస్‌ వచ్చే ఏడాది చివరిలో అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా వచ్చే అవకాశం ఉందట.
Tags:    

Similar News