ఎఫ్‌3 మరో అడుగు పడింది

Update: 2020-12-17 07:36 GMT
గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్‌ 2 మూవీ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ సమయంలోనే సీక్వెల్‌ ను చేయాలని దిల్ రాజు.. దర్శకుడు అనీల్ రావిపూడి నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనీల్ రావిపూడి వెంటనే ఎఫ్‌ 3 సినిమాను పట్టాలెక్కించాలని భావించినా కూడా కరోనా కారణంగా సాధ్యం కాలేదు. ఈ ఏడాదిలో ఎఫ్‌ 3 మొదలు అయ్యే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా ఎఫ్‌ 3 సినిమాను ఈ ఏడాదిలోనే పట్టాలెక్కించబోతున్నట్లుగా ఇటీవలే అనీల్ రావిపూడి పేర్కొన్నాడు.

నేడు లాంచనంగా ఎఫ్‌ 3 సినిమా పూజా కార్యక్రమాలు షూటింగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఈ నెల 23 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ కు వెళ్లబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. షూటింగ్‌ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అల్లు అరవింద్ హాజరు అయ్యారు. ముహూర్తం షాట్‌ కు వరుణ్‌ తేజ్‌ మరియు తమన్నాలపై అల్లు అరవింద్ క్లాప్‌ కొట్టాడు. షూటింగ్‌ లో బిజీగా ఉండటం వల్ల వెంకటేష్‌ షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. ఒక హీరోయిన్ గా తమన్నా కన్ఫర్మ్‌ అయ్యింది. మరి సెకండ్‌ హీరోయిన్‌ గా మెహ్రీన్‌ కంటిన్యూ అవ్వబోతుందా లేదంటే ఆమె స్థానంలో మరెవ్వరైనా రాబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్‌ చివరి వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News