పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఏక్ మినీ కథ''. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుంది. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల మిక్సింగ్ తో టైటిల్ మరియు 'డజ్ సైజ్ మ్యాటర్?' అనే ట్యాగ్ లైన్ పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మేకర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో మహా శివరాత్రిని పురస్కరించుకుని సినిమా నుంచి మినీ సర్ప్రైజ్ అంటూ టీజర్ ని విడుదల చేశారు.
'నా పేరు సంతోష్.. నేనొక సివిల్ ఇంజినీర్.. నాకు ఓ చిన్న ప్రాబ్లమ్ ఉంది' అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్ తోనే కొన్నిసార్లు 'చిన్న' విషయాలు జీవితంలో 'పెద్ద సమస్యల'ను ఎలా సృష్టిస్తాయనేది ఇందులో చూపించారు. హీరో తన ప్రాబ్లమ్ ని ఎవరికీ చెప్పుకోలేక ఫ్రస్ట్రేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అసలే స్మాల్ సైజ్ అని ఫీల్ అవుతున్న హీరోకి 'నా ఫేవరేట్ హీరో బిగ్ బీ.. నా ఫేవరేట్ టీవీ షో బిగ్ బాస్.. బిగ్ సినిమాస్ లో సినిమా చూస్తా' అంటూ బిగ్గర్ గా ఆలోచించే అమ్మాయి పరిచయమైతే ఎలా ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ చిన్న సైజే పెద్ద మ్యాటర్ అంటూ చాలా మంది యువకులను వెంటాడే సమస్య గురించి ఇందులో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఈ టీజర్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.
'ఏక్ మినీ కథ' చిత్రానికి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించాడు. ఇందులో బ్రహ్మాజీ - సుదర్శన్ - హర్షవర్ధన్ - సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.Full View
'నా పేరు సంతోష్.. నేనొక సివిల్ ఇంజినీర్.. నాకు ఓ చిన్న ప్రాబ్లమ్ ఉంది' అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్ తోనే కొన్నిసార్లు 'చిన్న' విషయాలు జీవితంలో 'పెద్ద సమస్యల'ను ఎలా సృష్టిస్తాయనేది ఇందులో చూపించారు. హీరో తన ప్రాబ్లమ్ ని ఎవరికీ చెప్పుకోలేక ఫ్రస్ట్రేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అసలే స్మాల్ సైజ్ అని ఫీల్ అవుతున్న హీరోకి 'నా ఫేవరేట్ హీరో బిగ్ బీ.. నా ఫేవరేట్ టీవీ షో బిగ్ బాస్.. బిగ్ సినిమాస్ లో సినిమా చూస్తా' అంటూ బిగ్గర్ గా ఆలోచించే అమ్మాయి పరిచయమైతే ఎలా ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ చిన్న సైజే పెద్ద మ్యాటర్ అంటూ చాలా మంది యువకులను వెంటాడే సమస్య గురించి ఇందులో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఈ టీజర్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.
'ఏక్ మినీ కథ' చిత్రానికి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించాడు. ఇందులో బ్రహ్మాజీ - సుదర్శన్ - హర్షవర్ధన్ - సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.