వీడియో : ఈషా రెబ్బా అదరగొట్టిందే

Update: 2020-05-16 05:00 GMT
తెలుగమ్మాయే అయినా కూడా ఈషా రెబ్బా ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసి పోకుండా స్కిన్‌ షో చేయడంతో పాటు యాక్టింగ్‌ విషయంలో కూడా మంచి పేరు దక్కించుకుంది. తెలుగులో ఈ అమ్మడు హీరోయిన్‌ గా పలు చిత్రాల్లో నటించింది. అయితే తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల స్టార్‌ హీరోల సరసన మాత్రం ఛాన్స్‌ రాలేదు. ఈమె ఎన్టీఆర్‌ చిత్రం అరవింద సమేతలో నటించినా అందులో సెకండ్‌ హీరోయిన్‌ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.

చిన్న చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ లో ముందుకు వెళ్తున్న ఈషా రెబ్బా తాజాగా ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అరవింద సమేత సెట్స్‌ లో ఇలా సరదాగా బైక్‌ రైడ్‌ చేసినట్లుగా ట్వీట్‌ చేసింది. ఈషా రెబ్బా బైక్‌ రైడ్‌ వీడియోను చూసి అంతా కూడా అబ్బా అంటున్నారు. పెద్ద బైక్‌ ను ఈషా సింపుల్‌ గా డ్రైవ్‌ చేస్తూ అందరిని ఆశ్చర్య పర్చుతోంది.

అరవింద సమేత చిత్రం తర్వాత మంచి ఆఫర్లు వస్తాయని ఆశించింది. కాని ఆ సినిమా ఆమె కెరీర్‌ కు బ్రేక్‌ తీసుకు రాలేక పోయింది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా ఈమె నటించేందుకు రెడీ అవుతుందట. భవిష్యత్తు పై చాలా ఆశలతో ఈమె సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలను రెగ్యులర్‌ గా పోస్ట్‌ చేస్తూ వస్తుంది.

Full ViewFull ViewFull View
Tags:    

Similar News