సంక్రాంతి మ్యాజిక్ రిపీటవుతుందా?

Update: 2016-09-29 12:27 GMT
ఒకప్పుడు సంక్రాంతి.. దసరా లాంటి పండగలకు ఓకేసారి నాలుగైదు సినిమాలు వచ్చేవి. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. సినిమాలకు లాంగ్ రన్ తగ్గిపోవడంతో ఒక సినిమాతో ఇంకో సినిమా పోటీ పడట్లేదు. ఒకే సినిమాను భారీగా థియేటర్లలో రిలీజ్ చేసి ఓపెనింగ్స్ రాబట్టుకోవడంపై దృష్టిపెడుతున్నారు నిర్మాతలు. పండగల టైంలో కూడా రెండుకు మించి సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి వచ్చేసింది గత కొన్నేళ్లలో.

కానీ ఈ ఏడాది సంక్రాంతికి అనూహ్యంగా నాలుగు పేరున్న సినిమాలు వచ్చాయి. అందులో మూడు హిట్టయ్యాయి. ఒకటి ఏవరేజ్‌ గా ఆడింది. ఈ ఊపు చూశాక పండగల టైంలో చాలా సినిమాలు రిలీజ్ చేసినా ఇబ్బంది లేదని ఫిక్సయ్యారు మన నిర్మాతలు. ఈ దసరాకు ఏకంగా ఐదు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఐతే దసరాకు కూడా సంక్రాంతి మ్యాజిక్ రిపీటవుతుందా అంటే.. సందేహమే.

సంక్రాంతికి వచ్చిన సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. వాటి రేంజ్ వేరు. అందులో మూడు భారీ సినిమాలు. ఇంకోటి కూడా క్రేజ్ ఉన్న మూవీనే. ఆ నాలుగు సినిమాల్ని మూడు రోజుల వ్యవధిలో రిలీజ్ చేయడం వల్ల అన్నింటికీ తొలి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ దసరాకు నాలుగు సినిమాల్ని ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ‘ప్రేమమ్’ ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అవుతుందనడంలో సందేహం లేదు.

మిగతా మూడు సినిమాలు మనవూరి రామాయణం.. ఈడు గోల్డ్ ఎహే.. అభినేత్రి చిత్రాలకు ఏమాత్రం ఓపెనింగ్స్ ఉంటాయన్నది సందేహం. వీటిలో ఏదీ ఎక్కువ కాదు.. ఏదీ తక్కువ కాదు. ఐతే సంక్రాంతి సినిమాల తరహాలో వీటి కోసం ప్రేక్షకులు ఎగబడే పరిస్థితి లేదు. మరోవైపు ముందు వారం రాబోతున్న ‘హైపర్’ అప్పటికి ఇంకా థియేటర్లలో ఉంటుంది. కన్నడ డబ్బింగ్ సినిమా ‘జాగ్వార్’కు కూడా కొన్ని థియేటర్లివ్వాలి. కాబట్టి దసరాకు వచ్చే తెలుగు సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురవడం ఖాయం. కాబట్టి దసరా సందర్భంగా సంక్రాంతి మ్యాజిక్ రిపీట్ కావడం కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News