ఫొటోటాక్‌ : సామాజిక దూరంతో 'దృశ్యం 2'

Update: 2020-10-16 04:45 GMT
మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ దృశ్యం ను తెలుగు.. తమిళం మరియు హిందీ భాషల్లో రీమేక్‌ చేశారు. మొత్తం నాలుగు భాషల్లో కూడా దృశ్యం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక దృశ్యం సీక్వెల్‌ ను లాక్‌ డౌన్‌ కు ముందు ప్రారంభించారు. లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు ఆరు నెలల పాటు షూటింగ్‌ జరగలేదు. మళ్లీ ఈమద్య దృశ్యం 2 షూటింగ్‌ ను ప్రారంభించారు. జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ అప్‌ డేట్స్‌ ను రెగ్యులర్‌ గా చిత్ర యూనిట్‌ సభ్యులు ఇస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లుగా మీనా సరదాగా ఈ ఫొటోను షేర్‌ చేసింది. కరోనా నేపథ్యంలో ఇలా సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్స్‌ చేస్తూ ఉన్నారు. మాస్క్‌.. దూరం మరియు శానిటైజర్స్‌ తప్పనిసరిగా షూటింగ్‌ సందర్బంగా ఉపయోగిస్తున్నారు. మలయాళంలో రూపొందుతున్న దృశ్యం 2 సక్సెస్‌ అయితే ఎలాంటి అనుమానం లేకుండా తెలుగులో వెంకటేష్‌ దాన్ని రీమేక్‌ చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. ఇదే సమయంలో తమిళం మరియు హిందీల్లో కూడా తప్పకుండా రీమేక్‌ అయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News