ట్రంప్‌ను ఆ రోజే లేపేసే అత‌ను దొరికిపోయాడు

Update: 2018-12-05 12:51 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విష‌యంలో సంచ‌ల‌న అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆయ‌న్ను చంపేసేందుకు ప్ర‌య‌త్నించిన ఓ దుండ‌గుడు దొరికిపోయాడు. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఫోర్క్‌లిఫ్ట్‌ను ఉపయోగించి ట్రంప్‌ను చంపాలని ప్రయత్నించినట్టు ఓ వ్యక్తి పోలీసుల ముందు అంగీకరించాడు. ఫోర్క్‌లిఫ్ట్‌తో అధ్యక్షుని కారును అడ్డగించి పడదోసి చంపయడమే తన లక్ష్యమని ఆయ‌న ఒప్పుకున్నాడు.  అయితే ఇది జరిగింది గత ఏడాది క్రితం.

2017 సెప్టెంబర్ 6న ట్రంప్ నార్త్ డకోటాలోని మండన్ సందర్శించారు. అక్కడున్న అతిపెద్ద రిఫైనరీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూతురు ఇవాంకా కూడా ఆయన వెంట ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి రిఫైనరీ ఆవరణలోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా ఓ ఫోర్క్‌లిఫ్ట్‌ను చేజిక్కించుకున్నాడు. అంతకుముందే అదే ప్రాంతంలో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాడు. దాంతో పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు వస్తున్నాడంటే సహజంగానే భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి. ఆగంతకుడు భద్రతా వలయాన్ని ఛేదించలేకపోయాడు. ఫోర్క్‌లిఫ్ట్‌ను ఓ గొయ్యలో వదిలిపెట్టి పారిపోయాడు. ఆ తర్వాత అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతడి పేరు గ్రెగరీ లీ లైగాంగ్ (42). గత శుక్రవారం కోర్టులో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. కాగా, అతడి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News