మంచు బ్రదర్స్ మద్య గొడవలు..!

Update: 2021-08-19 00:30 GMT
టాలీవుడ్‌ లో మంచి పేరున్న ఫ్యామిలీ.. ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ అనడంలో సందేహం లేదు. మోహన్‌ బాబు నటుడిగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన వారసులుగా మంచు విష్ణు.. మంచు లక్ష్మి మరియు మంచు మనోజ్ లు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలో వారు కూడా తమ వంతు ఎంటర్‌ టైన్ మెంట్‌ ను అందిస్తున్నారు. ఇటీవల మా ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడంకు సిద్దం అవుతుండటంతో పాటు ఆయన స్వయంగా మా భవనంను సొంత డబ్బుతో కట్టిస్తాను అంటూ ప్రకటించాడు. ఆయన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ కి ఉన్న గౌరవం ను నిలిపే విధంగా తాను సినిమాలు తీస్తాను చేస్తాను అంటూ  మంచు విష్ణు చెబుతూ ఉంటాడు. తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో మంచు విష్ణు పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్‌ వచ్చే వారం టెలికాస్ట్‌ కాబోతుంది. కాని అందుకు సంబంధించిన ప్రోమో మాత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంటర్వ్యూలో అలీ పలు సరదా ప్రశ్నలు.. సీరియస్‌ ప్రశ్నలను మంచు విష్ణు ను అడిగినట్లుగా ప్రోమోను చూస్తుంటే అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక సీరియస్ ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది.

మంచు విష్ణు తో ఒక సీరియస్‌ ప్రశ్న అంటూ అలీ.. మీరు మంచు మనోజ్‌ తో గొడవలు పడ్డారని వార్తలు వస్తున్నాయి.. అది ఎంత వరకు నిజం అని అడిగాడు. అందుకు మంచు విష్ణు సీరియస్ గా సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ కోర్టు విప్పేస్తూ సీరియస్ గా అక్కడ నుండి వెళ్లి పోబోయాడు. దాంతో అందరిలో కూడా అసలు ఏం జరిగింది అనే ఆసక్తి కలుగుతోంది. అయితే ప్రోమోలో ఈమద్య కాలంలో ఇలాంటివి కామన్ అయ్యాయి. ప్రోమోలో హడావుడి చేసి ఆ తర్వాత ఏమీ ఉండదు. వార్ని ఇంతేనా అన్నట్లుగా ఉంటుంది. షో లో కూడా మంచు విష్ణు సరదాగా అలీతో ఫ్రాంక్ అయినా చేసి ఉండాలి.. లేదంటే ప్రేక్షకులను బురిడి కొట్టించడానికి సరదాగా చేసి ఉండాలి. ఇక మంచు బ్రదర్స్ మద్య ఎలాంటి విభేదాలు లేవని వారి సన్నిహితులు క్లారిఫై ఇస్తున్నారు.
Tags:    

Similar News