#పుష్ప‌.. జిగేల్ రాణీని కొట్టేలా కాస్ట్ లీ ఐటెమ్ గాళ్ ని దించేస్తున్నారు!

Update: 2021-01-02 04:15 GMT
టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుల `ఐటెమ్` అభిరుచి గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఒకే ఒక్క ఐటెమ్ నంబ‌ర్ తో మాస్ ని ఓ ఊపు ఊపాల‌న్న ఫార్ములాని ఎప్ప‌టికీ విడిచిపెట్ట‌రు. ఇటీవ‌ల మెజారిటీ ద‌ర్శ‌కులు వేడెక్కించే హొయ‌లున్న‌ అందాల క‌థానాయిక‌ల్ని ఐటెమ్ భామ‌లుగా బ‌రిలో దించేస్తూ హీటెక్కించేయ‌డం అల‌వాటుగా మార్చుకున్నారు.

ఇక ఐటెమ్ భామ‌ల ఎంపిక‌లో లెక్క‌ల మాస్టార్ సుకుమార్ కి ప్ర‌త్యేక‌మైన రికార్డ్ ఉంది. పూరి జ‌గ‌న్నాథ్ త‌ర‌హాలోనే సుక్కూ అభిరుచి గురించి ఈ విష‌యంలో ఫ్యాన్స్ లో ఎక్కువ డిస్క‌ష‌న్ సాగుతుంటుంది. దర్శకుడు సుకుమార్ ఎప్పటికప్పుడు ఉత్తమమైన ఐటమ్ సాంగ్స్ కు ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. ఆర్య 2 లోని `రింగా రింగా`... `100 ప‌ర్సంట్ ప్రేమ`లో `దియలో దియాలా` .. `రంగస్థలం` లో `జిగేలు రాణి` ఇవ‌న్నీ సంచ‌ల‌నాలే. థియేట‌ర్ల‌లో మాస్ ని ఓ ఊపు ఊపేసిన ప్ర‌త్యేక గీతాలివి. వీటికి దేవీశ్రీ ఇచ్చిన బాణీలు కూడా అంతే ప‌ర్ఫెక్ట్ గా కుదిరాయి.

ఇప్పుడు పుష్ప కోసం అలాంటి ప్ర‌య‌త్నం సాగుతోంది. సుక్కూ మళ్ళీ ఉత్తర భారతదేశం నుండి అత్యంత కాస్ట్ లీ గాళ్ ని బ‌రిలో దించుతున్నాడు. ఒకే ఒక్క‌ ఐటమ్ నంబర్ కోసం ఏకంగా కోటి పైగా పారితోషికం వ‌సూలు చేసే లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీనే బ‌రిలో దించేస్తున్నార‌ట‌. అలాగే దేవీశ్రీ ఈ ఐటెమ్ నంబ‌ర్ పై ప్ర‌త్యేకించి ఫోక‌స్ చేయ‌నున్నారు. `రంగస్థలం` జిగేల్ రాణీని మించేలా రింగ రింగ ప్ర‌మాణాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ పాట‌ను డిజైన్ చేస్తున్నార‌ట‌.

`పుష్ప` పాట‌ల‌న్నీ మాస్ కి స్పెష‌ల్ ట్రీట్ గా ఉండేలా రెడీ చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. ఈ చిత్రం బహుళ భాషలలో విడుదల కానుంది కాబట్టి ఐటమ్ గాళ్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని అన్ని భాష‌ల బిజినెస్ కి ఇది క‌లిసొచ్చేలానే ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.
Tags:    

Similar News