తానొకటి తలిస్తే దైవమొకటి తలచినది
తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా ప్రస్తుతం నటవారసుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. బిగ్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు సినీపరిశ్రమలో ప్రవేశించిన చాలా మంది యువ ట్యాలెంట్ ఎటూ గాకుండా అయిపోయారు. సినిమాల్లో నటించినా థియేట్రికల్ రిలీజ్ కి ఛాన్సే లేదు. అలాగని ఓటీటీ వేదికలపై రిలీజ్ చేస్తామంటే బుల్లితెర స్టార్ అనుకుంటారేమోనని భయం. మొత్తానికి భారీ అంచనాలతో బరిలో దిగిన నటవారసులకు ఇది పెద్ద నిరాశ అనే చెప్పాలి.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మరింతగా నిరాశకు గురవుతోందిట. తాను నటించిన రెండో సినిమా `కార్గిల్ గర్ల్` ఓటీటీలో రిలీజవుతోంది. అలాగే మూడో సినిమా `రూహి అఫ్జా`ని కూడా ఓటీటీ రిలీజ్ కే రెడీ చేయాల్సి వస్తోందట. కార్గిల్ గార్ల్ చిత్రం వైమానిక దళ అధికారిణి గుంజన్ సక్సేనా బయోపిక్. ఇది నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. తొలి సినిమా ధడక్ ఆశించినంత విజయాన్ని ఇవ్వలేదు. ఆ క్రమంలోనే బోనీ-కరణ్ జోహార్ బృందం ముందు బిగ్ ఛాలెంజ్ ఎదురైంది. కానీ ఇప్పుడిలా అవుతుందని ఊహించలేకపోతున్నారట.
కనీసం తెలుగులో అయినా డెబ్యూ సినిమా క్రేజీగా ఉండాలని ఇప్పుడు సరికొత్త ఆలోచన చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడ మగధీర రామ్ చరణ్ .. యంగ్ చియాన్ అఖిల్ లాంటి నటవారసుల సరసన గతంలో అవకాశాలు వచ్చినా జాన్వీ కాదనుకుందని ప్రచారమైంది. విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ స్టార్ అంటూ ఇటీవల ఆసక్తిని కనబరిచింది. కానీ ఇక్కడ ఎవరి సరసన అవకాశం అందుకుంటుంది? లిఫ్టిచ్చే మగధీర ఎవరు? అన్నది ఇప్పుడే చెప్పలేం. మరోవైపు జాన్వీ కీలకపాత్రలో బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న `తక్త్` హిస్టారికల్ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ లేనే లేదు ఎందుకనో!