ట్రైల‌ర్ టాక్‌: డ‌ర్టీ హ‌రి డ‌ర్టీ వేషాల‌కు మెంట‌లే!!

Update: 2020-07-18 05:41 GMT
ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెర‌కెక్కించి ఎంతోమంది హీరోలు.. హీరోయిన్లు.. టెక్నీషియన్లను తెలుగు తెర‌కు పరిచయం చేసిన నిర్మాత ఎం.ఎస్. రాజు. ఆయ‌న దర్శకుడిగానూ సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన యూత్ ఫుల్ మోడ్ర‌న్ ఏజ్ సినిమా `డ‌ర్టీ హ‌రి`. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్లు యూత్ లో వేడి పెంచాయి. లేటెస్ట్ ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు కంటెంట్ లోనూ ఆర్.డీ.ఎక్స్ క్వాంటిటీ ఎక్కువే కూరారు.

తాజాగా రిలీజైన ట్రైల‌ర్ చూస్తే ఆ సంగ‌తి ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ట్రైల‌ర్ ఆద్యంతం వేడెక్కించే స‌న్నివేశాల‌కు కొద‌వేమీ లేదు. డ‌ర్టీ హ‌రి అన్న టైటిల్ కి న్యాయం చేసే సీన్స్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యాయి. హ‌రికి ఫ్రెండు ఐదు రూల్స్ చెబుతున్నాడు. మొద‌టిది లైఫ్ ని నీట్ గా ప్లాన్ చేస్కోవాలి. ఎప్పుడూ హైగా ఉడేలా చూస్కోవాలి. రెండోది బాస్ కి కూతురు ఉంటే వెంట‌నే క్యాచ్ చేసి రీచ్ చేయాలి. త‌న‌కు న‌చ్చిన‌వ‌న్నీ చేయాలి. అయితే మూడో స‌ల‌హా.. నీ బెస్ట్ ఫ్రెండ్ ల‌వ‌ర్‌ కి మాత్రం అస్స‌లు సైట్ కొట్ట‌కూడ‌దు.. నాలుగో స‌ల‌హా.. సైట్ కొడితే కొట్టావ్ కానీ కెల‌క్కే.. అంటుకుంటే పెంటైపోద్ది.. ఆ నాలుగూ వింటేగా ఐద‌వ‌ది చెప్ప‌డానికి .. ఈ రూల్ నేను చెప్పను.. ! డ‌ర్టీ ఫెలో!!.. అంటూ డైలాగ్ లోనే థీమ్ ఏంటో చెప్పేశారు. బ్యాక్ గ్రౌండ్ లో సునీల్ వాయిస్ ప్ర‌ధాన అస్సెట్ అనే చెప్పాలి.

స్కూల్ కాలేజ్ కుర్రాళ్ల‌కు న‌చ్చే.. మెంట‌లెక్కించే కంటెంట్ కి ఇందులో కొద‌వేమీ లేదు. తెర నిండుగా వేడెక్కించే స‌న్నివేశాల్లో ఎక్క‌డా త‌గ్గ‌లేద‌నే ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. డ‌ర్టీ హ‌రి టైటిల్ కి త‌గ్గ‌ట్టే అన్నీ డ‌ర్టీ వేషాలు వేసే మోడ్ర‌న్ యువ‌కుడి క‌థాంశ‌మిది. ఎం.ఎస్.రాజుగారు ఎగ్జిక్యూట్ చేసిన విధానం బావుంది. హీరో శ్ర‌వ‌ణ్ రెడ్డి స్మార్ట్ అప్పియ‌రెన్స్ .. సిమ్ర‌త్.. రుహానీల‌ వేడెక్కించే స్టింట్ అస్సెట్స్.. మార్క్ కె రాబిన్ సంగీతం బావుంది.

ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు- గూడూరు సాయి పునీత్ నిర్మించారు. శ్రవణ్ రెడ్డి ఈ చిత్రంలో హీరో. సిమ్రత్ కౌర్.. రుహాణి శర్మ నాయిక‌లు. రొటీన్ కథలకు స్వ‌స్తి చెప్పి.. నేటి యూత్ ను దృష్టిలో పెట్టుకుని ట్రెండీగా చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ఏ మేర‌కు స‌ఫ‌ల‌మ‌వుతుందో చూడాలి. అన్ని ప‌నులు పూర్త‌యిన ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Full View
Tags:    

Similar News